త్రివిక్రమ్ తో నాని మల్టీస్టారర్.. ఇది మ్యాటర్!
అయితే మల్టీస్టారర్స్ పై రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఫలానా ఇద్దరు హీరోలు కలిపి చేస్తే బాగుంటుందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతుంటారు.
By: Tupaki Desk | 24 April 2025 8:32 AMమల్టీస్టారర్.. సినీ ఇండస్ట్రీకి ఆ వర్డ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై ఒకరు కన్నా ఎక్కువ మంది హీరోలను చూడాలని సినీ ప్రియులు ఎప్పటికప్పుడు తహతహలాడుతుంటారు. అందుకే మల్టీస్టారర్స్ రావాలని ఎప్పుడూ కోరుకుంటారు. ఆ విధంగానే డైరెక్టర్స్ కూడా ముందుకొస్తుంటారు.
అయితే మల్టీస్టారర్స్ పై రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఫలానా ఇద్దరు హీరోలు కలిపి చేస్తే బాగుంటుందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతుంటారు. కానీ ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నాని కలిసి ఓ సినిమా చేయాలన్న డిమాండ్ పెద్దగా వినపడలేదు. వెంకటేష్, చిరంజీవి కలిసి చేస్తే బాగుంటుందని అంతా అన్నారు.
అలాంటిది ఇప్పుడు తాను, వెంకటేష్ కలిసి ఓ మూవీ చేయాల్సిందని, కానీ సెట్ అవ్వలేదని రీసెంట్ గా నాని చెప్పడంతో అంతా షాకయ్యారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తామిద్దరూ సినిమా చేసేలా ప్రపోజల్ ఉందని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదని చెప్పారు. దానికి రీజన్ ఏంటో తెలియదని, ఇంకా ఏం చెప్పలేనని అన్నారు.
దీంతో ఇప్పుడు ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఆ సమయంలో వెంకటేష్ తో త్రివిక్రమ్ వర్క్ చేస్తారని టాక్ వినిపించింది. కానీ అది రూమర్ గానే మిగిలిపోయింది.
అయితే త్రివిక్రమ్.. నాని, వెంకీతో ఆ ప్లాన్ చేశారమోనని ఇప్పుడు కొందరు నెటిజన్లు అనుమానిస్తున్నారు. కానీ నాని మాత్రం తన ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏదేమైనా వెంకటేష్, నాని కాంబో మాత్రం నెవ్వర్ బిఫోర్ అనే చెప్పాలి. ఇద్దరిలో కామెడీ టైమింగ్ బాగుంటుందని, త్రివిక్రమ్ మార్క్ తోడైతే మూవీ వేరే లెవెల్ అని అంటున్నారు.
కచ్చితంగా ఫన్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పాలి. ఏదేమైనా నాని మాత్రం ఆ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ త్రివిక్రమ్ ఆలోచన ఏంటో మాత్రం తెలియదు. అయితే నాని ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల, సుజీత్ తో సినిమాలు పూర్తి చేయనున్నారు. కాబట్టి వెంకటేష్- నాని మల్టీస్టారర్ ప్లాన్ గురించి తెలిసిన నుంచి.. అది కచ్చితంగా జరిగితే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు!