Begin typing your search above and press return to search.

వెంకీ నాగ్ ఒక మల్టీస్టారర్ చేస్తే..?

వెంకటేష్, నాగార్జున కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని అటు దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 10:30 PM
వెంకీ నాగ్ ఒక మల్టీస్టారర్ చేస్తే..?
X

సిల్వర్ స్క్రీన్ పై ఒక స్టార్ హీరో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఉర్రూతలూగుతారు. అలాంటి తెర మీద ఇద్దరు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. కొన్నాళ్లుగా తెలుగు తెర మీద మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరి హీరోల మీద ఉంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోల మల్టీస్టారర్స్ అయితే ఫ్యాన్స్ కి కన్నుల పండగగా ఉంటుందని భావిస్తున్నారు. అది కూడా కొన్ని రేర్ కాంబినేషన్స్ సెట్ అయితే ఫ్యాన్స్ కి వచ్చే కిక్కు మామూలుగా ఉండదు.

అలాంటి ఒక కాంబినేషనే విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున కలయిక. వెంకటేష్ సెంటిమెంట్ ఎమోషన్, నాగార్జున రొమాంటిక్ ఇక వర్సటాలిటీ ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో మెప్పిస్తూ దశాబ్దాల కాలంగా తమ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఐతే ఆఫ్ స్క్రీన్ వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్ వీళ్లిద్దరు కలిసి నటిస్తే చూడాలని అనుకుంటున్నారు.

వెంకటేష్, నాగార్జున కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని అటు దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇద్దరు స్టార్స్ అది కూడా సీనియర్ హీరోలు ఇద్దరు అలా కలిసి ఒక కథలో భాగం అయితే రికార్డులు అదిరిపోతాయి. వెంకటేష్, నాగార్జున మధ్య చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది కాబట్టి ఒకరిది ఎక్కువ మరొకరిది తక్కువ పాత్ర అని కాలిక్యులేట్ చేసుకునే అవసరం ఉండదు. సో సీనియర్ స్టార్స్ లో మల్టీస్టారర్ అంటూ వస్తే మాత్రం తప్పకుండా ఈ ఇద్దరిదే ముందు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

సరైన కథ కుదిరితే వెంకీ, నాగ్ కలిసి నటించడానికి ఎప్పటికైనా రెడీ అనేస్తారు. నాగార్జున సినిమాలో తనది సెకండ్ ప్రియారిటీ ఉన్న పాత్ర అయినా సరే క్యారెక్టరైజేషన్ నచ్చితే చాలు ఓకే చెప్పేస్తాడు. ఇక వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి తిరుగు ఉండదు. సో అర్జెంట్ గా ఈ ఇద్దరిని కలిపే ఒక కథను రైటర్స్ సిద్ధం చేస్తే అదిరిపోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం వెంకటేష్, నాగార్జున ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. తప్పకుండా ఈ కాంబో కుదరాలంటే ఒక మ్యాజిక్ జరగాల్సిందే. మరి అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి.