వెంకటేష్, మోహన్ బాబు కాంబో ఎలా మిస్సైంది..?
కొన్ని సినిమా కథగా ఉన్నప్పుడు అనుకున్న కాంబినేషన్స్ వేరే ఉంటాయి. కానీ అవి తెర మీదకు వెళ్లే టైం కి కాస్టింగ్ మారిపోతుంది.
By: Tupaki Desk | 16 July 2025 11:21 PM ISTకొన్ని సినిమా కథగా ఉన్నప్పుడు అనుకున్న కాంబినేషన్స్ వేరే ఉంటాయి. కానీ అవి తెర మీదకు వెళ్లే టైం కి కాస్టింగ్ మారిపోతుంది. అలా ఒక సినిమా కాస్టింగ్ గురించి ఈమధ్య ఆ సినిమా రైటర్ రివీల్ చేసిన విషయం తెలిసి అందరు షాక్ అయ్యారు. ఇంతకీ అదే సినిమా ఎవరు హీరో.. ఎవరి డైరెక్షన్ లో వచ్చింది అంటే.. కాస్త డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే.
కింగ్ నాగార్జున హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సూపర్. ఈ సినిమాతోనే తెలుగు తెరకు స్వీటీ అనుష్క పరిచయం అయ్యింది. నాగార్జునతో పాటు ఈ సినిమాలో సోనూ సూద్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఐతే పూరీ జగన్నాథ్ ఈ సినిమాను అసలైతే కథ రాసుకున్నప్పుడు వెంకటేష్, మోహన్ బాబులతో చేయాలని అనుకున్నారట.
వెంకటేష్ డేట్స్ కుదరకపోవడంతో మోహన్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ చేయలేదు. ఐతే నాగార్జునతో అప్పటికే శివమణి చేసిన పూరీ మళ్లీ ఈ కథ చెప్పగా ఆయన చేస్తానని అన్నారట. అలా నాగార్జున ఓకే అయితే మరో పాత్రలో రవితేజ, సునీల్ శెట్టి ఆఖరికి ప్రకాష్ రాజ్ ని కూడా అనుకున్నారట.
కానీ ఫైనల్ గా సోనూ సూద్ వచ్చి చేరాడు. అలా సూపర్ సినిమా వచ్చింది. ఐతే ఈ సినిమాలో బాలీవుడ్ భామ అయేషా టకియా కూడా ఒక హీరోయిన్ గా చేసింది. కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా పూరీ, నాగార్జున కాంబోలో వచ్చిన ఒక స్టైలిష్ యాక్షన్ మూవీగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా సినిమా చేసిన పూరీ ఆ సినిమాతో హిట్ కొడతాడని అనుకుంటే అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. ఐతే ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నాగార్జున తనకు శివమణి లాంటి హిట్ ఇచ్చాడని సూపర్ సినిమా అవకాశం ఇచ్చారు.
ఐతే సూపర్ సినిమా బ్యాక్ స్టోరీ ముందు వెంకటేష్ మోహన్ బాబు నుంచి రవితేజ, సునీల్ శెట్టి దాకా వెళ్లిన విషయం తెలిసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత పూరీ మహేష్ తో పోకిరి సినిమా చేశాడు. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టడమే కాదు మహేష్ కి సూపర్ స్టార్ డం తెచ్చిపెట్టింది.
