సమోసాల లెక్క ఇంటికెళ్లే సరికి 40!
విక్టరీ వెంకటేష్ తానెంత పెద్ద స్టార్ అయినా? ఎంతో డౌన్ టూ ఎర్త్. ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడు తుంటారు.
By: Tupaki Desk | 18 Jun 2025 5:02 PM ISTవిక్టరీ వెంకటేష్ తానెంత పెద్ద స్టార్ అయినా? ఎంతో డౌన్ టూ ఎర్త్. ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడు తుంటారు. ఇప్పుడంటే పుడ్ విషయంలో నియమ నిబంధనలు పాటిస్తున్నారు గానీ... పాత రోజుల్లో మాత్రం తాను కూడా మంచి పుడీ అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఉమ్మడి కుటుంబం కావడంతో డైనింగ్ టేబుల్ పై చికెన్ ముక్కల కోసం లేబుల్ కింద కాళ్లు ఎలా తన్నుకున్నోవో ఇప్పటికే రివీల్ చేసారు.
కుటుంబంలోకి రానా కూడా వచ్చిన తర్వాత తమ అందిరి కంటే తాను పెద్ద పుడీ అయ్యాడని దీంతో ముక్కల కోసం పోటీ మరింత తీవ్రమైందని అన్నారు వెంకీ ఓ సందర్భంలో. ఇదంతా చెన్నైలో ఉన్న ప్పుడు జరిగిన విశేషాలు. అదే చెన్నైలో చదువుకుంటోన్న రోజులు ఇంకా గొప్పగా ఉండేవన్నారు. ప్రతీ గురువారం వెంకటేష్ తల్లి డబ్బులిస్తే చెన్నై డీలక్స్ హోటల్ 50 సమోసాలు కొనుక్కుని వచ్చేవారుట.
వాటిలో 10 సమోసాలు మార్గ మధ్యలోనే తినేసేవాడినన్నారు. హోటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 40 సమోసాలు ఇంటికి వచ్చేవన్నారు. అడిగితే కాకి లెక్కలు చెప్పి తప్పించుకునేవాడినన్నారు. పుడ్ విష యంలో అప్పట్లో తాను అబద్దాలు ఎక్కువగా చెప్పేవాడినన్నారు వెంకీ. ఇంకా ఇలాంటి తిండి ముచ్చట్లు ఎన్నో ఉన్నాయన్నారు.
వెంకీ చెప్పే జీవిత సత్యాలు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. వెంకటేష్ ఒకప్పుడు పెద్దగా మాట్లాడే వారు కాదు. కానీ ఇప్పుడు ఆయనే ముందుకొచ్చి అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడటం అ భిమానులకు ఎంతో నచ్చుతుంది. స్టార్ అంటే కేవలం తెరకు మాత్రమే పరిమితం కాకుండా అందరితో మమేకం అవుతూ మెలుగుతున్నారు.
