Begin typing your search above and press return to search.

పాప కోసం 'సైంధవ్'​ పోరాటం

ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేశ్

By:  Tupaki Desk   |   17 July 2023 7:40 AM GMT
పాప కోసం సైంధవ్​ పోరాటం
X

ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేశ్​.. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. 'హిట్‌' సిరీస్​తో సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​గా మారిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో 'సైంధవ్​' సినిమా చేయనున్నారు వెంకీ. ఆయన కెరీర్​లో 75వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా రానుంది.

టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌తోనే ఈ సినిమా ఆడియెన్స్​లో భారీ ఆసక్తిని నెలకొంది. గ్లింప్స్​ను చూపించిన ఆసక్తికర అంశాలను చూసి.. ఈ సినిమా కథ మొత్తం ఓ పాప, ఇంజెక్షన్​ చుట్టూ తిరగబోతుందని అప్పట్లో అంతా మాట్లాడుకున్నారు. అనుకున్నట్టే.. తాజాగా మూవీటీమ్​ ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది. అందులో ఓ పాప.. వెంకీని హత్తుకుని కనిపించింది.

అయితే ఈ పోస్టర్​లో వెంకీ, పాప ముఖంపై దెబ్బలు కనిపిస్తున్నాయి. అలాగే పాప ముఖంపై కాస్త చిరునవ్వు కూడా కనిపించింది. అంటే ఈ పోస్టర్​ భారీ యాక్షన్ తర్వాత అయిఉండొచ్చని అనిపిస్తోంది. ఇకపోతే పాప పాత్ర పేరును కూడా పరిచయం చేశారు మేకర్స్​. గాయత్రి అని తెలిపారు. ఈ చిత్రం కథ మొత్తం పాప చూట్టే తిరుగుతుందని స్పష్టమవుతోంది. అయితే ఈ చిత్రంలోనే ప్రతి పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు.

ఇకపోతే సినిమా టైటిల్ గ్లింప్స్​ అనౌన్స్ చేసినప్పుడు.. వెంకీ ఓ చేతిలో గన్​ మరో చేతిలో ఇంజెక్షన్ బాక్స్​ పట్టుకుని ఉంటారు. ఆ ఇంజెక్షన్ బాక్స్ మీద Genezo(ఓ సంస్థ పేరు), ఇంజెక్షన్ మీద onasemnogene abeparvovec అని రాసి ఉంటుంది. SMA (Spine Muscular Atrophy) అనే అరుదైన వ్యాథికి నుంచి కాపాడేందుకు దీన్ని వినియోగిస్తారు. దీనిని Zolgensma పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఇంజక్షన్​ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రగ్స్​లో ఒకటి.

దీని ధర ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.16కోట్లు ఉంటుందని అప్పట్లో అన్నారు. కొంతకాలం క్రితం చాలామంది పిల్లలు SMA వ్యాధి వల్ల చనిపోతుంటే.. కొంతమందిని ఈ ఇంజక్షన్ ​ ద్వారానే కాపాడారు. అంటే ఇప్పుడు కొత్త పోస్టర్​లో ఉన్న పాప కోస వెంకీ చేసే పోరాటం కూడా ఆ పాపను బతికించేందుకనే అని తెలుస్తోంది.

ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్​ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్​ నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తెలుగు తెరపై అరంగేట్రం చేస్తున్నారు. వికాస్​ మాలిక్​ అనే విలన్ పాత్రలో కనిపించనున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్​గా నటిస్తోంది. రుహాని శర్మా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే సంతోశ్​ నారాయన్​ టైటిల్​ గ్లింప్స్​ కోసం అందించిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది. గ్యారీ బీహెచ్​ ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్​, కిషోర్​ థల్లూర్​ కో ప్రోడ్యూసర్​. సినిమా ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.