హిట్ సినిమాకు సీక్వెల్ పనుల్లో నయా డైరెక్టర్!
వరుస ప్లాప్ లతో స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తెరకెక్కించిన చివరి మూడు చిత్రాలు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి.
By: Tupaki Desk | 25 Jun 2025 7:30 AMవరుస ప్లాప్ లతో స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తెరకెక్కించిన చివరి మూడు చిత్రాలు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. 'మన్మద లీల', 'కస్టడీ', 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందకోవడంల విఫలమయ్యాయి. దీంతో ఈ నయా డైరెక్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఏంటా సినిమా? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. శింబు, ఎస్.జె సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సైన్స్ పిక్షన్ థ్రిల్లర్ 'మానాడు' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. శింబు వరుస పరాజయాలు ఎదుర్కోంటున్న సమయంలో వెంకట్ ప్రభు పిలిచి మరీ హీరోగా అవకాశం ఇచ్చి చేసాడు. ఈ విజయం శింభుకు భారీ ఊరనిచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
తెలుగులో ఈ చిత్రం 'ది లూప్' గా రిలీజ్ అయింది. ఇక్కడా విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రంగా నిలిచింది. శింబు, సూర్య పాత్రలకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మానాడు సీక్వెల్ తీయాలనే ఆలోచనలో వెంకట్ ప్రభు కనిపిస్తున్నాడు. త్వరలోనే సీక్వెల్ పనుల్లో బిజీ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం శింబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
డ్రాగన్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే వెట్రిమారన్ తోనూ మరో సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు కూడా శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది రిలీజ్ అయిన వెంటనే మానాడు సీక్వెల్ పనుల్లో బిజీ అయ్యే అవకాశం ఉంది. సక్సెస్ కూడా అంతే కీలకం. వరుస ప్లాప్ లతో దర్శకుడిగా ఆయన స్థానం మారుతోన్న సంగతి తెలిసిందే.