Begin typing your search above and press return to search.

ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా పండుగ‌లో ఏకైక భారతీయ సినిమా?

హిందీ చిత్రం `స్టోలెన్` ప్ర‌తిష్ఠాత్మ‌క‌ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపికైంది.

By:  Tupaki Desk   |   10 Sept 2023 1:16 PM IST
ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా పండుగ‌లో ఏకైక భారతీయ సినిమా?
X

గౌరవ్ ధింగ్రా (GD)కి చెందిన `జంగిల్ బుక్ స్టూడియో` నిర్మించిన హిందీ చిత్రం `స్టోలెన్` ప్ర‌తిష్ఠాత్మ‌క‌ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపికైంది. అభిషేక్ బెనర్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ అద్భుతమైన విజయం వెన‌క కంటెంట్ ఒక ప్ర‌ధాన కార‌ణం. సినిమా అసాధారణ కథనాన్ని ..సృజనాత్మక నైపుణ్యానికి ద‌క్కిన గొప్ప‌ గుర్తింపుగా మేక‌ర్స్ భావిస్తున్నారు.

ప్రపంచ వేదికపై భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎదుగుద‌ల అనూహ్య‌మైన‌ది. అంత‌ర్జాతీయ సినిమా ఉత్సవాల్లో మ‌న సినిమా ఎంతగానో సంద‌డి చేస్తోంది. ఇప్పుడు `స్టోలెన్` భారతదేశం నుండి వచ్చిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. కొన్ని అద్భుతమైన అంతర్జాతీయ చలనచిత్రాలతో పోటీప‌డుతున్న ఏకైక భారతీయ చిత్రం. వీటిలో డేవిడ్ ఫించర్ -ది కిల్లర్, బ్రాడ్లీ కూపర్ - మాస్ట్రో, సోఫియా కొప్పోల - ప్రిస్సిల్లా, ఎమ్మా స్టోన్ , మార్క్ రుఫెలో A24 చిత్రం- పూర్ థింగ్స్ .. ఎడోర్డో డి ఏంజెలిస్ - కమాండెంట్ ఉన్నాయి.

ప్రతిభావంతులైన శుభమ్, మియా మెల్జర్‌ల ఇందులో తారాగ‌ణం. భారతదేశంలోని మారుమూల గ్రామీణ రైల్వే స్టేషన్ నేపథ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. జుంపా మహతో అనే అణగారిన మహిళ, ఆమె తల్లి నుండి అపహరించిన ఐదు నెలల శిశువు కథ ఏమిట‌న్న‌ది తెర‌పై చూడాలి. ఈ హృదయ విదారక సంఘటన ఇద్దరు పట్టణ సోదరులు, గౌతమ్ - రామన్ దృష్టిని ఆకర్షిస్తుంది. వారి సంబంధాలు, న‌మ్మ‌కాలు అనంత‌రం స‌వాళ్ల నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే సినిమా ఇది.

నటుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ,-``స్టోలెన్ నా కెరీర్‌లో చాలా ఛాలెంజింగ్ రోల్స్‌లో ఒకటి. నేను చేసే పాత్ర నిజ జీవితంలో నా పాత్ర‌కు చాలా భిన్నమైన‌ది. ఇది భావోద్వేగాలు అనుభవాల లోతుల్లోకి వెళ్లడానికి నన్ను బలవంతం చేసిన క‌థ‌. నా కంఫర్ట్ జోన్‌ను దాటి నన్ను నేను మలుచుకోవాల్సి వ‌చ్చింది. ప్రతిష్టాత్మక వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశం నుంచి ఈ చిత్రం ప్రాతినిధ్యం వహించడం నిస్సందేహంగా ఒక స్మారక విజయం. నేను గౌరవం అందుకున్నాను. ఇలాంటి ఒక కథ చెప్పే శక్తి సరిహద్దులను అధిగమించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రపంచ వేదికపై ఉన్న ప్రేక్షకులు మా సినిమాతో ఎలా కనెక్ట్ అవుతారో చూడాల‌ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అని అన్నారు.

దర్శకుడు కరణ్ తేజ్‌పాల్ మాట్లాడుతూ, -``వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మా సినిమా ఎంపిక కావడం మాకు చాలా గర్వకారణం. చలనచిత్ర ప్రపంచంలో ఒక ముద్ర వేసిన విశేషమైన చిత్రాలను ప్రదర్శించే గొప్ప చరిత్ర ఈ ఫెస్టివల్‌కు ఉంది. అటువంటి గౌరవనీయమైన చోట‌ అవ‌కాశం ద‌క్కింది. ఈ విశిష్ట వేదికపై స్టోలెన్‌ను ప్రదర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాము`` అన్నారు.