డ్రీమ్ ప్రాజెక్ట్ కి 1000 కోట్లు పెట్టే నిర్మాత ఎవరు?
శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా `వేల్పరి` అనే నవలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళ చరిత్ర ఆధారంగా వెంకటేషన్ రచించిన నవల అది.
By: Srikanth Kontham | 3 Dec 2025 10:00 PM ISTశంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా `వేల్పరి` అనే నవలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళ చరిత్ర ఆధారంగా వెంకటేషన్ రచించిన నవల అది. దాని ఆధారంగా ఇప్పటికే ఓ సీరియల్ కూడా తెరకెక్కింది. ఇప్పుడదే కథను శంకర్ సినిమాగా తీయానులకుంటున్నారు. దాన్ని ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. ఆ కథను శంకర్ మూడు భాగాలుగా చెప్పాలనుకుంటున్నారు. ఒక్కో భాగానికి 300 కోట్ల బడ్జెట్ గా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 1000 కోట్ల బడ్జెట్ చిత్రంగా `వేల్పరి` తేలింది. ఇందులో విక్రమ్, సూర్య, శివ కార్తికేయన్ లాంటి స్టార్లను మెయిన్ లీడ్ గా అనుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది.
వరుస ప్లాప్ ల నేపథ్యంలో:
ప్రస్తుతం శంకర్ ఆ ప్రాజెక్ట్ పనుల్లోనే ఉన్నారు? అన్నది తాజా సమాచారం. గత పరాజయాలన్నింటిని `వేల్పరి` సక్సెస్ తో బ్యాలెన్స్ చేయాలనే కసి మీద ఉన్నట్లు తెలిసింది. ఇంత వరకూ బాగానే ఉంది ఇప్పుడాయన్ని నమ్మి 1000 కోట్లు ఖర్చు చేసే నిర్మాత ఎవరు? అన్నదే ఆసక్తికరం. శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులైతే మొదలు పెట్టారు. కానీ ఇంకా నిర్మాణ సంస్థ పైనల్ కాలేదు. దీంతో ఆ లక్కీ నిర్మాత ఎవరు? అన్నది ఆసక్తికరం. శంకర్ గత కొంత కాలంగా వరుస పరాజయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తీస్తున్న సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.
వాళ్లంతా నష్టాల్లోనే:
దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. శంకర్ గత సినిమా `గేమ్ ఛఖేంజర్` 300 కోట్ల బడ్జెట్ సినిమా ప్లాప్ అయింది. అంతకు ముందు చేసిన `ఇండియన్ 2` బడ్జెట్ భారీగానే కేటాయించారు. అదీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. భారీ కాన్వాస్ పై `2.0` చేసారు. అదీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు. మంచి అటెంప్ట్ గానే మిగిలిపోయింది. అంతకు ముందు రిలీజ్ అయిన `ఐ `కూడా డిజాస్టర్ అయింది. పదేళ్ల క్రితమే ఈ సినిమాకు 100 కోట్లు ఖర్చు చేసారు. ఇలా శంకర్ ఖాతాలో గత కొంత కాలంగా ప్లాప్ లే కనిపిస్తున్నాయి. ఆ సినిమాలు నిర్మించిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు.
శంకర్ ని నమ్మేదెవరు?
ఇలాంటి సమయంలో? `వేల్పరి` కోసం 1000 కోట్లు పెట్టే నిర్మాత సెట్ అవ్వడం అంటే అంత సులభం కాదు. శంకర్ ని ఎంతో నమ్మితే తప్ప సాధ్యం కాదు. ఆయన్ని నమ్మి మందుకొచ్చే నిర్మాత ఎవరవుతారో చూడాలి. టాలీవుడ్ కి వ చ్చి `గేమ్ ఛేంజర్` నిర్మించిన సమయంలోనే సొంత భాషలో నిర్మాతలు దొరకకే ఇక్కడకి వచ్చారనే ప్రచారం జరిగింది. మరి ఇప్పుడెలాంటి ప్రచారానికి తావిస్తారో చూడాలి.
