Begin typing your search above and press return to search.

వీరవనిత మారబోతున్న స్టార్‌ హీరోయిన్‌

హిందీ మరియు తెలుగు సినిమాల్లో వరుసగా నటిస్తూ వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు చాలా కాలం తర్వాత తమిళ సినిమా చేయబోతుంది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 12:47 PM GMT
వీరవనిత మారబోతున్న స్టార్‌ హీరోయిన్‌
X

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూతురు శృతి హాసన్‌ హీరోయిన్ గా పాన్ ఇండియా రేంజ్ లో వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. హిందీ మరియు తెలుగు సినిమాల్లో వరుసగా నటిస్తూ వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు చాలా కాలం తర్వాత తమిళ సినిమా చేయబోతుంది.

2021 లో విజయ్‌ సేతుపతితో కలిసి లాభం అనే సినిమాను చేసింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు శృతి హాసన్‌ తమిళ్‌ లో సినిమా చేయలేదు. ఇన్నాళ్ల తర్వాత శృతి హాసన్‌ తమిళ సినిమాకు ఓకే చెప్పింది. వేలు నాచియార్ అనే వీర వనిత బయోపిక్ లో శృతి హాసన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వేలు నాచ్చియార్ పాత్ర అత్యంత కీలకం అంటూ తమిళ చరిత్రకారులు చెప్పుకొచ్చారు. వీర వనిత కథతో ఇప్పటికే సినిమాను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నాచ్చియార్‌ పాత్ర కోసం శృతి హాసన్‌ ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టిందట. తెలుగు లో ఒక సినిమాను చేయడంతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఇక ఒక వెబ్‌ సిరీస్‌ ను కూడా ఈ అమ్మడు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శృతి హాసన్‌ ఫుల్‌ బిజీ బిజీగా ఉంది.