Begin typing your search above and press return to search.

వీర‌శంక‌ర్ ప్యానెల్ విజ‌యం..మ‌ళ్లీ ఆయ‌న‌కే ప‌ట్టం

ఆదివారం ఉద‌యం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వీర‌శంక‌ర్ ప్యానల్..స‌ముద్ర ప్యానెల్ బ‌రిలోకి దిగాయి.

By:  Tupaki Desk   |   11 Feb 2024 1:03 PM GMT
వీర‌శంక‌ర్ ప్యానెల్ విజ‌యం..మ‌ళ్లీ ఆయ‌న‌కే ప‌ట్టం
X

నేడు తెలుగు సినీ ద‌ర్శ‌కుల సంఘంకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్ ప్యాన‌ల్ విజ‌యం సాధిం చింది. ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడిగా మరోసారి వీర‌శంక‌ర్ ఎన్నిక‌య్యారు. వైస్ ప్రెసిడెంట్ గా వశిష్ట, సాయి రాజేష్ ఎంపిక‌వ్వ‌గా..జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా మ‌ద్దినేని ర‌మేష్‌..సుబ్బారెడ్డి..ట్రెజ‌ర‌ర్ గా పి.విర‌మ‌ణారెడ్డి విజ‌యం సాధించారు. ఆదివారం ఉద‌యం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వీర‌శంక‌ర్ ప్యానల్..స‌ముద్ర ప్యానెల్ బ‌రిలోకి దిగాయి.

ద‌ర్శ‌కుల సంఘంలో మొత్తం 1500 మంది యాక్టివ్ మెంబ‌ర్స్ ఉన్నారు. ఈరోజు ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల‌వ‌ర‌కూ పోలింగ్ జ‌రిగింది. అనంత‌రం లెక్కింపు ప్రారంభం అవ్వ‌డం..ఫ‌లితాలు రావ‌డం అంతా ఐదు గంట‌ల‌కు పూర్త‌యింది. వీర‌శంక‌ర్ విజ‌యం సాధించిన‌ట్లు అధికారికంగా ప్ర‌క టించారు. మొత్తం 1113 ఓట్లు పోల‌వ్వ‌గా ఇందులో వీర‌శంక‌ర్ కు 536 ఓట్లు.. స‌ముద్ర‌కు 304 ఓట్లు వ‌చ్చాయి.

వీర‌శంక‌ర్ ఇప్ప‌టికే ప‌లుమార్లు ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడిగా ప‌నిచేసారు. 1997లో ఆయ‌న 'హ‌లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌మ‌య్యారు. ఆ త‌ర్వాత 'ప్రేమ‌కోసం' ..'విజ‌య రామ‌రాజు'..'మ‌న కుర్రాళ్లే'..'యువ‌రాజ్యం' చిత్రాలు తెర‌కెక్కించారు. 2004 లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో 'గుడుంబా శంక‌ర్' అనే సినిమా కూడా ఆయనే తెర‌కెక్కించారు. ఈ సినిమాతో ఆయ‌న కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న పేరు అప్ప‌టి నుంచే బాగా ఫేమ‌స్ అయింది.

అయితే ఐదేళ్ల‌గా వీర‌శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమాలు చేయ‌లేదు. చివ‌రిగా ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం 'యువ‌రాజ్యం'. ఆ త‌ర్వాత న‌టుడిగానూ మ్యాక‌ప్ వేసుకున్నారు. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'జాతిర త్నాలు' సినిమాలో న‌టించాడు. ఆ త‌ర్వాత 'ఒక చిన్న కుటుంబ క‌థ‌'..'విరాట ప‌ర్వం'..'గంధ‌ర్వ‌'..'బుజ్జి ఇలా రా' లాంటి చిత్రాల్లో న‌టించారు.