Begin typing your search above and press return to search.

వీడియో : ఇదే వీరప్పన్ అసలైన స్టోరీ

కూసీ మునిస్వామి వీరప్పన్‌ టైటిల్‌ తో వీరప్పన్‌ డాక్యుమెంటరీని నేటి నుంచి జీ 5 ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తోంది

By:  Tupaki Desk   |   14 Dec 2023 7:36 AM GMT
వీడియో : ఇదే వీరప్పన్ అసలైన స్టోరీ
X

కర్ణాటక, తమిళనాడు తో పాటు మొత్తం సౌత్‌ రాష్ట్రాలను గడగడలాడించి, కేంద్ర బలగాలను సైతం ముప్పు తిప్పలు పెట్టి, నాలుగు రాష్ట్రాల పోలీసులను నానా ఇబ్బందులకు గురి చేసి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ గా పేరు మోసిన వీరప్పన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చాయి.

ఆ మధ్య రామ్‌ గోపాల్‌ వర్మ కూడా వీరప్పన్ పై సినిమాను తీసిన విషయం తెల్సిందే. అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు, సిరీస్ లు అన్ని కూడా వీరప్పన్‌ గురించి పోలీసులు మరియు కొందరు చెప్పిన విషయాల ఆధారంగా రూపొందాయి. కానీ మొదటి సారి వీరప్పన్ తన కథను తానే చెబుతున్న వీడియోలతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది.

కూసీ మునిస్వామి వీరప్పన్‌ టైటిల్‌ తో వీరప్పన్‌ డాక్యుమెంటరీని నేటి నుంచి జీ 5 ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తోంది. వీరప్పన్‌ అసలు పేరు కూసీ మునిస్వామి వీరప్పన్‌. అదే పేరును డాక్యుమెంటరీ టైటిల్‌ గా నిర్ణయించి విడుదల చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

వీరప్పన్‌ ను గతంలో నక్కిరన్‌ గోపాల్‌ వీడియో ఇంటర్వ్యూ చేశాడు. వీరప్పన్‌ గురించి తెలిసిన వారికి నక్కిరన్ కూడా సుపరిచితుడు. అలాంటి నక్కిరన్‌ చాలా ఏళ్ల క్రితం వీరప్పన్‌ ను వీడియో ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియో ఇంటర్వ్యూ హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎవరికి కూడా ఆయన ఇవ్వలేదు.

ఎట్టకేలకు నక్కిరన్‌ గోపాల్‌ కూతురు నిర్మాణంలో వీరప్పన్‌ డాక్యుమెంటరీ రూపొందింది. అప్పటి వీరప్పన్ ఇంటర్వ్యూ వీడియోను ఈ డాక్యుమెంటరీ లో పొందుపరచడం జరిగింది. వీరప్పన్ కి నేను అంటే అభిమానం.. నాకు ఆయన అంటే అభిమానం. ఆ అభిమానంతోనే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే వీరప్పన్‌ కి సంబందించిన అసలైన స్టోరీ అంటూ డాక్యుమెంటరీ ప్రమోషన్‌ లో నక్కిరన్ గోపాల్‌ పేర్కొన్నాడు.