Begin typing your search above and press return to search.

బాలయ్య - బాబీ.. ఈ టైటిల్ ఫిక్స్ అయినట్లే..?

ఈ సినిమాకి 'వీరమాస్' అనే టైటిల్ ని బాబీ కన్ఫర్మ్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్.

By:  Tupaki Desk   |   8 April 2024 4:11 AM GMT
బాలయ్య - బాబీ.. ఈ టైటిల్ ఫిక్స్ అయినట్లే..?
X

నందమూరి బాలకృష్ణ సినిమాలు అన్ని ఇప్పుడు హై వోల్టేజ్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్ లో ఉంటున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని బాలయ్య తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూడు సినిమాలు భారీ కలెక్షన్స్ ని రాబట్టాయి. దీంతో బాలయ్య మార్కెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగింది. యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమాలు చేయడం కోసం పోటీ పడుతున్నారు.

అలాగే సీనియర్ దర్శకులు కూడా బాలకృష్ణ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కొద్ది రోజుల నుంచి బాలయ్య ఎన్నికల క్యాంపైన్ లో బిజీ కావడం షూటింగ్ వాయిదా పడింది. ఎన్నికల తర్వాత మరల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్.

ఇదిలా ఉంటే బాలయ్య మూవీకి డైరెక్టర్ బాబీ టైటిల్ ని ఫిక్స్ చేసాడంట. ఉగాది రోజున టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే టైటిల్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి 'వీరమాస్' అనే టైటిల్ ని బాబీ కన్ఫర్మ్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. బాలయ్య మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా, అలాగే మూవీలో క్యారెక్టరైజేషన్ బట్టి వీరమాస్ టైటిల్ ని డిసైడ్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

అలాగే మరో రేండు టైటిల్స్ కూడా చర్చల్లో ఉన్నాయట. ఇక ఎక్కువగా అందరి ఫోకస్ మాత్రం వీరమాస్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకి ప్రతినాయకుడిగా బాబీ డియోల్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా హీరోయిన్ గా చేస్తోంది. ఆమె క్యారెక్టర్ మూవీలో చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. వీలైనంత వేగంగా ఈ మూవీ పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం వర్క్ నడుస్తోంది. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఉగాది రోజున ఈ సినిమాకి సంబందించిన కంప్లీట్ డీటెయిల్స్ బయటకొచ్చే అవకాశం ఉంది. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ నుంచి వస్తోన్న మూవీ ఇదే కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మెగాస్టార్ కి సెకండ్ ఇన్నింగ్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యకి బాబీ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.