వీరమల్లు ప్రచారం...ఓజీ షూటింగ్ ఒకేసారా?
`హరిహరవీరమల్లు` గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. జూన్ 12న చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 19 May 2025 1:52 PM IST`హరిహరవీరమల్లు` గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. జూన్ 12న చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన పోర్షన్ షూటింగ్ కూడా పూర్తి చేయడంతో రిలీజ్ కన్పమ్ అయింది. మరి వీరమల్లు ప్రచారం సంగతేంటి? అంటే ప్రచారం బాధ్యత కూడా పవన్ పై అంతే ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఉత్తరాదిన కూడా ప్రచారం చేయాలి. కేవలం తెలుగు రాష్ట్రాల ఈవెంట్లకు హాజరైతే సరిపోదు.
మరి ఉత్తరాదిన ప్రచారం ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఒక్కసారి ముంబై వెళ్తే రెండు పనులు అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. `ఓజీ` షూటింగ్ లో భాగంగా పవన్ ఈ నెలఖరున ముంబై వెళ్తారు. హైదరా బాద్ షెడ్యూల్ అనంతరం అది జరుగుతుంది. ముంబైలో 15 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని సమాచారం. ఈరోజులన్నింటిని ఓజీకే కేటాయించారు. అయితే ఇదే సమయంలో వీరమల్లు ప్రచారం కూడా ఉండేలా చూసుకోమని మేకర్స్ ని కోరినట్లు వార్తలొస్తున్నాయి. ప్రచారానికి కేవలం రెండు..మూడు గంటలు కేటాయిస్తే సరిపోతుంది కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
పవన్ కు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆ మధ్య తిరుపతి పోరాటంతో బాగా ఫేమస్ అయ్యారు. నిరంతనం స్వామివారి మాలలోనే ఏడాది కాలంగా వైరల్ అవుతున్నారు. దీంతో పవన్ నార్త్ లో బాగా ఫేమస్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ కి అత్యంత సన్ని హితుడిగా ఉండటం కూడా కలిసొస్తుంది. ఇవన్నీ వీరమల్లుకు కలిసొచ్చే అంశాలు.
మోఘల సామ్రాజ్యంపై వీరమల్లు పోరాటం సినిమా కథ కావడం పవన్ కు ఈ టైమ్ లో బాగా కలిసొచ్చే అంశం. రాజకీయంగా వీరమల్లు కొంత ప్లస్ అవుతుంది. దేశంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామలు.. మతం అనే అంశం తో పవన్ బాగా ఫోకస్ అవుతున్నారు. `అఖండ` తర్వాత నటసింహ బాలకృష్ణ కూడా నార్త్ లో బాగా ఫేమస్ అయ్యారు. అది పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా అఘోర పాత్రలో సంచలన మవ్వడంతోనే ఆ క్రేజ్ సాధ్యమైందన్నది తెలిసిందే.
