Begin typing your search above and press return to search.

వీరమల్లు.. కింగ్డమ్ తో థియేటర్లు కళకళలాడుతాయా..?

ఈ రెండు సినిమాల మేకర్స్ మాత్రం వారి సినిమాల ఫలితాల మీద చాలా నమ్మకంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   9 July 2025 9:15 AM IST
వీరమల్లు.. కింగ్డమ్ తో థియేటర్లు కళకళలాడుతాయా..?
X

సినిమాను థియేటర్ లో చూసే ఆడియన్స్ సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంది. అందుకే సినిమాను ప్రేక్షకులకు చేరవేసేందుకు మేకర్స్ బీభత్సమైన ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్య వచ్చిన కుబేర తో కాస్త థియేటర్లు సందడిగా కనిపించాయి. మళ్లీ లాస్ట్ వీక్ సినిమాలేవి మెప్పించలేదు. మళ్లీ థియేటర్లు కళకళలాడాలంటే హిట్టు బొమ్మ పడాలి. ఈ నెల 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు వస్తుంది.

పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీరమల్లు సినిమాపై ట్రైలర్ ఇంకాస్త అంచనాలు పెంచింది. క్రిష్ మొదలు పెట్టిన ఈ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశాడు. సినిమా ట్రైలర్ ముందు వరకు పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా థియేటర్ల దగ్గర ఒక రేంజ్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా తర్వాత ఈ నెల చివరి రోజున అంటే జూలై 31న విజయ్ దేవరకొండ కింగ్ డం వస్తుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన కింగ్ డమ్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీ హైప్ తెచ్చింది. ఈ సినిమా తప్పకుండా విజయ్ కి హిట్ ఇచ్చేలా ఉంది. సో ఈ సినిమా కూడా థియేటర్ల దగ్గర ఆడియన్స్ సందడి కనిపించేలా ఉంది.

ఈ రెండు సినిమాల మేకర్స్ మాత్రం వారి సినిమాల ఫలితాల మీద చాలా నమ్మకంగా ఉన్నారు. పవన్ వీరమల్లు మొన్నటిదాకా సైలెంట్ గా ఉండి ఫైర్ పటాకాలా ట్రైలర్ రిలీజ్ నుంచి సూపర్ బజ్ పొందింది. ఇక కింగ్ డం సినిమా మీద ముందునుంచి విజయ్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

సో ఈ రెండు సినిమాలతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు పూర్వ వైభవం రావాలని ఆశిస్తున్నారు మేకర్స్. స్టార్ సినిమాను ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు తప్ప కామన్ ఆడియన్స్ రావట్లేదు. ఎలాగు నెల రోజుల్లో ఓటీటీలో వస్తుందిగా అన్న ఆలోచన ఆడియన్స్ లో బలంగా నాటుకుపోయింది. మరి రాబోతున్న వీరమల్లు, కింగ్డమ్ టాలీవుడ్ కి హిట్ జోష్ ఇస్తాయేమో చూడాలి. ఈ రెండు సినిమాల రిజల్ట్ మీద నెక్స్ట్ రాబోయే సినిమాల ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు.