వీరమల్లు సంధ్యలో రెండు షోలేనా..?
ఐతే ఇది కేవలం మొదటి రోజు మాత్రమేనా లేదా సంధ్యలో ఇక మీదట అన్ని స్టార్ సినిమాలు రెండు షోస్ మాత్రమే వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
By: Tupaki Desk | 22 July 2025 6:45 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. వీరమల్లు కోసం పవన్ కేటాయిస్తున్న టైమ్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి అందిస్తుంది. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ అదిరిపోగా నెక్స్ట్ వైజాగ్ లో కూడా మరో ఈవెంట్ ని అనుకుంటున్నారు.
ఇక పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే ఉండే హంగామా ఏదైతే ఉందో అది మొదలైంది. బుకింగ్స్ కూడా బాగున్నాయ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ మొన్నటిదాకా వీరమల్లు ని అసలు పట్టించుకోలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో పాటు అప్పటి నుంచి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో పవర్ స్టార్ సినిమా అంటే ఉండే ఉత్సాహం వేరు. అందుకే అక్కడ బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.
ఐతే మిగతా అన్ని థియేటర్స్ లో అన్ని షోస్ కి సంబంధించిన టికెట్స్ ఓపెన్ కాగా సంధ్య థియేటర్ కి మాత్రం రెండు షోస్ మాత్రమే ఓపెన్ చేశారు. అది కూడా మధ్యాహ్నం ఆట, ఫస్ట్ షో ఆటవి మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీని వెనక రీజన్ ఏంటన్నది తెలియలేదు. పుష్ప 2 రిలీజ్ టైమ్ లో జరిగిన తొక్కిసలాట వల్ల థియేటర్ యాజమాన్యం కూడా ఇబ్బందుల్లో పడింది. అందుకే హరి హర వీరమల్లు సినిమాను కేవలం రెండు ఆటలే వేస్తున్నారట.
ఐతే ఇది కేవలం మొదటి రోజు మాత్రమేనా లేదా సంధ్యలో ఇక మీదట అన్ని స్టార్ సినిమాలు రెండు షోస్ మాత్రమే వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. వీరమల్లు సినిమాపై ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంది.
తెలుగు రెండు రాష్ట్రాల్లో వీరమల్లు జోరు మొదలైంది. సినిమాతో మరోసారి పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగు రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచారు. సినిమా స్పెషల్ షో ముందు రోజు రాత్రి 9 గంటలకు పర్మిషన్ ఇచ్చారు.
వీరమల్లు బజ్ తో సోషల్ మీడియాలో అంతా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. మరి ఆఫ్టర్ గ్యాప్ తో పవర్ స్టార్ నుంచి వస్తున్న పవర్ ఫుల్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
