Begin typing your search above and press return to search.

టైగర్ నాగేశ్వరరావు.. పక్కా మాస్ యాంగిల్

వీడు అనే పేరుతో రానున్న ఈ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు తెలిపారు. టైగర్ నాగేశ్వరరావులోని మాస్ కోణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 1:08 PM GMT
టైగర్ నాగేశ్వరరావు.. పక్కా మాస్ యాంగిల్
X

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కింది. ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో తన అదృష్టాన్ని తొలిసారి పరీక్షించుకోనున్నారు రవితేజ. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచిన మూవీటీమ్ సెకండ్ సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చింది.


1970ల కాలంలో గజదొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జీవి ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ప్రమోషన్స్ లో భాగంగా ప్రచార చిత్రాలు వరుసగా రిలీజ్ చేయడం మొదలు పెట్టారో అంచనాలు డబుల్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ అంటూ డ్యుయెట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అది శ్రోతలను బాగానే ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. వీడు అనే పేరుతో రానున్న ఈ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు తెలిపారు. టైగర్ నాగేశ్వరరావులోని మాస్ కోణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు. ఓ మాస్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ పక్కా మాస్ యాష్(బూడిద) కలర్ బ్యాక్ గ్రౌండ్ తో డిజైన్ చేశారు. రణరంగంలా మారిన ప్రదేశంలో చోక్కాలు లేకుండా కండలు తిరిగిన దేహంతో భారీగా మంది.. వారంతా మంటల్లో కాలుతున్న కంచెకు ఓ వైపు ఉండగా.. ఆ కంచెను దాటుకుని బీడీ కాలుస్తూ సీరియస్ గా ఎవరినో ఎదిరించేందుకు ధైర్యంగా నడుస్తూ ముందుకెళ్తున్నట్లుగా రవితేజ కనిపించారు. ఆయన డ్రెస్ లుకింగ్ స్టైల్ టాప్ టు బాటమ్ ఎంతో మాసివ్ గా డీగ్లామర్ గా చూపించారు.

ఇదంతా చూస్తుంటే ఈ రెండో సాంగ్ ఫుల్ పవర్ ఫుల్ గా చిత్రీకరించారని అర్థమవుతోంది. మరి ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి.. ఇక ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రం రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో..