Begin typing your search above and press return to search.

పింక్ బికినీలో మ‌తులు చెడ‌గొట్టిన వేదిక‌

నారా రోహిత్ `బాణం` సినిమాలో న‌టించింది వేదిక‌. ఆ సినిమా త‌ర్వాత టాలీవుడ్ కోలీవుడ్ లో ప‌లు సినిమాల్లో నాయిక‌గా న‌టించింది.

By:  Tupaki Desk   |   18 Dec 2023 3:53 AM GMT
పింక్ బికినీలో మ‌తులు చెడ‌గొట్టిన వేదిక‌
X

నారా రోహిత్ `బాణం` సినిమాలో న‌టించింది వేదిక‌. ఆ సినిమా త‌ర్వాత టాలీవుడ్ కోలీవుడ్ లో ప‌లు సినిమాల్లో నాయిక‌గా న‌టించింది. రాఘవ లారెన్స్ `ముని` చిత్రంలోను వేదిక క‌థానాయిక‌. ఈ భామ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోను చెల‌రేగుతోంది. చిట్టి పొట్టి దుస్తులు.. బికినీలు స్విమ్ సూట్ల‌తో మతులు చెడ‌గొడుతోంది. ఇన్ స్టాలో వేదిక షేర్ చేస్తున్న ఫోటోలు వీడియోలు క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారుతున్నాయి.


తాజాగా పింక్ బికినీలో బీచ్ ప‌రిస‌రాల్లో వేదిక ప్ర‌త్య‌క్షమైంది. ఈ ఫోటో చూడ‌గానే పింకీ పింకీ బార్బీ అంటూ అభిమానులు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఈ ఫోటోగ్రాఫ్ లో వేదిక పింక్ బార్బీనే త‌ల‌పిస్తోందని మెజారిటీ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌వేళ పాన్ ఇండియా ట్రెండ్ లో బార్బీ క‌థ‌తో సినిమా తీస్తే ఇండియ‌న్ వెర్ష‌న్ బార్బీగా అల‌రిస్తుందేమో చూడాలి. ప్ర‌స్తుతం వేదిక పింక్ బికినీ యూత్ లో వైర‌ల్ గా మారుతోంది.


త‌మిళ దర్శకుడు బాల తెర‌కెక్కించిన‌ జాతీయ అవార్డు చిత్రం `పరదేశి`లో స‌రికొత్త‌ అవతారంలో క‌నిపించింది. అంగమ్మ పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా న‌టించి మెప్పించిన వేదిక‌ ఒళ్ళు గగుర్పొడిచే క్లైమాక్స్‌లో షో స్టాప‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో మెప్పించింది. కానీ ఇటీవ‌ల తెలుగు త‌మిళంలో వేదిక‌కు ఆశించిన‌న్ని అవ‌కాశాలు రాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2019లో బాలకృష్ణ రూలర్‌తో టాలీవుడ్‌కి తిరిగి వచ్చింది. అదే సంవత్సరంలో స్పానిష్ చిత్రం హిందీ రీమేక్ అయిన `ది బాడీ`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.