Begin typing your search above and press return to search.

నడుము అందాలతో మాయ చేస్తోన్న వేదిక

బాలయ్య రూలర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తెలుగులో ఆమె చేసిన రజాకార్ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 5:15 AM GMT
నడుము అందాలతో మాయ చేస్తోన్న వేదిక
X

సౌత్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ వేదిక. ఈ మరాఠీ ముద్దుగుమ్మ తమిళంలో మదరాసి సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత లారెన్స్ ముని సినిమాతో మొదటి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది.


ఈ సినిమా డిజాస్టర్ అయిన తరువాత నారా రోహిత్ మొదటి చిత్రం బాణంతో సక్సెస్ అందుకోవడంతో పాటు నటిగా కూడా మంచి మార్కులు సొంతం చేసుకుంది. అయితే తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయితే తమిళ్, మలయాళీ భాషలలో మాత్రం మంచి అవకాశాలు సొంతం చేసుకుంది. నాగార్జున బంగార్రాజు సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది.


బాలయ్య రూలర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తెలుగులో ఆమె చేసిన రజాకార్ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అలాగే జంగిల్ అనే మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 18 ఏళ్ళు కావస్తోంది. అయిన కూడా ఇప్పటికి వన్నె తగ్గని అందంతో మెరిసిపోతూనే ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ భాగా యాక్టివ్ అయ్యింది.


ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా అందాల ప్రదర్శన చేస్తూ హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ ఉండటంతో గ్లామర్ పరంగా డోస్ పెంచింది. వేదిక అందానికి ఆమె నడుమే ఆభరణం. అందుకే దర్శకులు కూడా ప్రత్యేకంగా వేదిక నడుమునే ఫోకస్ చేయడానికి ఇష్టపడతారు.


ఆమె కూడా తన అందాన్ని రెట్టింపు చేసే నడుము సోయగాలు చూపిస్తూ కుర్రకారుని బుట్టలో వేసుకుంటుంది. తాజాగా అదిరిపోయే ఫోజ్ తో నడుము అందాన్ని ఎలివేట్ చేస్తూ తీసుకున్న ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ అందాలకి ఫ్యాన్స్ ఇన్ స్టాగ్రామ్ లో కవితలతో కితాబు ఇస్తూ ఉండటం విశేషం.