Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : చిట్టి నడుమునే చూస్తుంటే...!

ఆకట్టుకునే అందం తో పాటు మతి పోగొట్టే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.

By:  Tupaki Desk   |   3 March 2024 1:48 PM GMT
పిక్ టాక్‌ : చిట్టి నడుమునే చూస్తుంటే...!
X

తెలుగు ప్రేక్షకులకు నందమూరి కళ్యాణ్ రామ్‌ మూవీ విజయదశమిలో హీరోయిన్ గా నటించి పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవ్వబోతుంది. అయినా ఇప్పటికి కూడా ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. ఓ రేంజ్ లో అందాల ఆరబోత ఫోటోలతో కవ్విస్తోంది.

నటిగా ఈ మధ్య కాలంలో మళ్లీ బిజీ అయ్యి కన్నడం మరియు మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న వేదిక సోషల్‌ మీడియా ద్వారా అంతకు మించి అన్నట్లుగా ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు.

నడుము నాభి అందాలను చూపిస్తూ వేదిక నిజంగానే ఈమె అందాల వేదిక అన్నట్లుగా ఫోజ్ ఇచ్చింది. ఆకట్టుకునే అందం తో పాటు మతి పోగొట్టే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేసే వేదిక ఈ సారి చేతులు పైకి ఎత్తి సన్నని నడుము చూపిస్తూ ఉంటే అబ్బ అన్నట్లుగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చిట్టి నడుమునే చూస్తుంటే అన్నట్లుగా పాట పాడుతున్న వారు కూడా ఉన్నారు. మొత్తానికి వేదిక యొక్క అందాల ఆరబోత ఫోటోల్లో ఇది ది బెస్ట్‌ అన్నట్లుగా నిలుస్తుందని కొందరు ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రేంజ్‌ లో అందాల ఆరబోత చేస్తున్న కారణంగానే ఇంకా చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగు లో మళ్లీ ఈ అమ్మడిని చూసే రోజు ఎప్పటికి వస్తుందో అని ఈ ఫోటోలు చూసిన తెలుగు ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు.