Begin typing your search above and press return to search.

అనుష్క హోర్డింగ్‌ కారణంగా 40 యాక్సిడెంట్స్‌

'వేదం' సినిమా విడుదల అయ్యి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను కొందరు నెమరువేసుకున్నారు.

By:  Tupaki Desk   |   5 Jun 2025 2:51 PM IST
అనుష్క హోర్డింగ్‌ కారణంగా 40 యాక్సిడెంట్స్‌
X

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క ముఖ్య పాత్రల్లో నటించిన 'వేదం' సినిమా విడుదల అయ్యి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన వేదం సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. థియేట్రికల్‌ రిలీజ్‌తో ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. కానీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌, శాటిలైట్‌ టెలికాస్ట్‌లో మాత్రం మంచి స్పందన దక్కించుకుంది. వేదం సినిమాను ఎంతో మంది చూశారు, ఇంకా చూస్తూనే ఉంటారు. అల్లు అర్జున్ పాత్రతో పాటు అనుష్క పాత్ర లు ప్రేక్షకులను అంత ఈజీగా వదిలిపెట్టవు. అనుష్క అలాంటి రోల్‌ చేయడం గొప్ప విషయం.


హీరోయిన్‌గా అప్పుడే కెరీర్‌లో సెటిల్‌ అవుతున్న ముద్దుగుమ్మ అనుష్కను వేశ్య పాత్రలో క్రిష్ 'వేదం' సినిమాలో చూపించాడు. సినిమాలోని అనుష్క పాత్ర విషయంలో చాలా మంది నెగటివ్‌ కామెంట్స్ చేశారు. కానీ అనుష్క మాత్రం చాలా నమ్మకంతో వేదం సినిమాను చేసింది. సినిమా విడుదల సమయంలో అనుష్క పోస్టర్స్‌, హోర్డింగ్స్‌ను ప్రముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది. హోర్డింగ్స్‌లో అనుష్క యొక్క చీర కట్టు ఫోటోలను చూపించారు. ముఖ్యంగా ఐకానిక్ ఫోజ్ అయిన అనుష్క పోస్టర్స్‌ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఇంటర్నెట్‌లో వేదం అని సెర్చ్ చేస్తే ఎక్కువగా అనుష్క ఎల్లో కలర్‌ చీర కట్టులో నడుము చూపిస్తూ, చేతిపై సరోజా అని టాటూ వేయించుకున్న ఫోటోలు కనిపిస్తాయి.

'వేదం' సినిమా విడుదల అయ్యి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను కొందరు నెమరువేసుకున్నారు. ముఖ్యంగా పంజాగుట్ట సర్కిల్‌ వద్ద ఈ సినిమాలోని అనుష్క హోర్డింగ్‌ను పెద్దదిగా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్‌ రోడ్డు పై వెళ్లే ప్రతి ఒక్కరికీ కనిపించే విధంగా పెట్టడం జరిగిందట. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో చాలా మంది ఆ పోస్టర్‌ను చూడటం కోసం ఆగేవారట. కొందరు రన్నింగ్‌లోనే అనుష్క వైపు చూస్తూ అలాగే ఉండి పోయేవారు. దాంతో ఆ హోర్డింగ్‌ను చూస్తూ డ్రైవ్‌ చేయడం, ఆ పోస్టర్‌ను చూడటం కోసం ఆపిన వారికి మొత్తంగా కలిపి 40 చిన్న పెద్ద యాక్సిడెంట్స్ అయ్యాయి. ప్రాణాలు పోలేదు కానీ చాలా డ్యామేజీ అయితే జరిగిందట.

ఆ హోర్డింగ్‌ రోడ్డు మీద ఉండటంతో ఏకంగా 40 యాక్సిడెంట్స్ అయినట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వెంటనే ఆ హోర్డింగ్‌ను తొలగించారట. ఆ స్థాయిలో అప్పట్లో అనుష్క వేదం పోస్టర్ ఉండేది. ఇప్పుడు సోషల్‌ మీడియా ఎక్కువగా ఉండటం వల్ల ముందు నుంచే పోస్టర్స్ షేర్ చేస్తున్నారు, అవి వైరల్‌ అవుతున్నాయి. కానీ అప్పట్లో సోషల్‌ మీడియాలో పోస్టర్స్‌ను పెద్దగా చూసే అవకాశం ఉండేది కాదు. అందుకే అలా హోర్డింగ్‌ను చూస్తూ ఆమె అభిమానులు యాక్సిడెంట్స్‌కు గురి అయ్యారు. వేదం సినిమా 15 ఏళ్ల వేడుకలో ఇంకా చాలా మెమరబుల్‌ మూమెంట్స్ను చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు.