Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. ఇక యుద్ధమే..

వర్కింగ్ టైటిల్ గా 'యుద్ధం' అనుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే ఉండబోతున్నయట.

By:  Tupaki Desk   |   11 Oct 2023 3:16 PM GMT
విజయ్ దేవరకొండ.. ఇక యుద్ధమే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. లైగర్ సినిమా నిరాశపరచడంతో ఖుషీ తో అయినా రొమాంటిక్ యాంగిల్ లో మార్కెట్ను పెంచుకోవాలని చూశాడు. కానీ ఈ రూట్ కూడా అతనికి పెద్దగా కలిసి రాలేదు. ఇక తదుపరి విజయ్ సినిమాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో కొంత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

పరశురాంతో చేస్తున్న సినిమా అయితే పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు క్లారిటీ అయితే వచ్చేసింది. ఆ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలని ఒక టార్గెట్ కూడా సెట్ అయింది. అయితే గౌతమ్ తిన్ననీరి దర్శకత్వం లో కూడా విజయ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అందులో విజయ్ ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే గ్యాంగ్ స్టార్ కాన్సెప్ట్ కూడా అందులో ఉంటుందట. ఇక వీటితో పాటు విజయ్ లిస్టులో మరొక సినిమా కూడా చేరింది. దిల్ రాజు ప్రొడక్షన్లో యువ దర్శకుడు రవి కిరణ్ తో కూడా విజయ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది విజయ్ 14వ సినిమాగా తెరపైకి రాబోతోంది. అయితే ఇది యాక్షన్ పీరియడ్ డ్రామాగా ఉండబోతుంది.

వర్కింగ్ టైటిల్ గా 'యుద్ధం' అనుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే ఉండబోతున్నయట. విజయ్ దేవరకొండ చాలా అగ్రేసివ్ గా అందులో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా అతని సమాధానం యుద్ధమే అనే తరహాలోనే ఉంటుందని ఇక చివరికి ఒక ఊహించని సైన్యమే అతనిపై తిరగబడితే ఎలా ఎదుర్కొంటాడు అనే పాయింట్ తో ఆ కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ దర్శకుడు ఇంతకుముందు రాజావారు రాణివారు, అశోకవనంలో అర్జున కళ్యాణం అనే కూల్ సినిమాలను అందించాడు. కానీ ఇప్పుడు కంప్లీట్ గా తన మేకింగ్ విధానాన్ని మార్చుకోబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక విజయ్ భవిష్యత్తు లో సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.