Begin typing your search above and press return to search.

విజయ్ - రష్మిక.. మళ్ళీ హింట్ ఇచ్చారుగా..

అయితే మరోసారి విజయ్ రష్మిక మధ్యలో ఏదో కొనసాగుతోంది అనేలా సోషల్ మీడియాలో మరొక వార్తకు ఇన్ స్టాగ్రామ్ పోస్టులు హింట్ ఇచ్చాయనే టాక్ వస్తోంది.

By:  Tupaki Desk   |   11 March 2024 12:37 PM GMT
విజయ్ - రష్మిక.. మళ్ళీ హింట్ ఇచ్చారుగా..
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బిగ్ స్క్రీన్ పై బెస్ట్ జోడిగా క్రేజ్ అందుకున్న వారిలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా గీతగోవిందం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా ఈ ఇద్దరి కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక మూడోసారి రష్మిక విజయ్ కాంబినేషన్లో మరో సినిమా చూడాలి అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వీరి మధ్యలో ఉన్నది స్నేహమా? ప్రేమనా? అనే సందేహాలు ఇదివరకే చాలా సార్లు వచ్చాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో రకాల కథనాలు కూడా వచ్చాయి.

అయితే ఈ విషయంపై ఎప్పుడూ కూడా ఈ దటర్స్ పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. గాసిప్స్ ఎన్ని పుట్టుకొస్తున్న కూడా ఏనాడు వాటి గురించి పట్టించుకోలేదు. బిజీ కెరీర్ లో వారి పని వారు చేసుకుంటూ వెళుతున్నారు. కానీ కొన్నిసార్లు వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు వేసుకుంటున్న డ్రెస్ లు క్యూరియసిటీ పెంచుతున్నాయి. ఆ మధ్య ఒకే తరహా షర్ట్ వేసుకోవడం, అలాగే గోవా తో సేమ్ ప్లేస్ లో ఉన్న ఫొటోలు విడివిడిగా పోస్ట్ చేయడం వంటి అంశాలు హాట్ టాపిక్ గా నిలిచాయి.

అయితే మరోసారి విజయ్ రష్మిక మధ్యలో ఏదో కొనసాగుతోంది అనేలా సోషల్ మీడియాలో మరొక వార్తకు ఇన్ స్టాగ్రామ్ పోస్టులు హింట్ ఇచ్చాయనే టాక్ వస్తోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన బ్రాండ్ రౌడీ వేర్ ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. అందులో అతను ఒక క్యాప్ కూడా పెట్టుకున్నాడు. అయితే మహిళా సాధికారిక కోసం ఒక పోస్ట్ పెట్టిన రష్మిక మందన ఆ ఫోటోలో అదే రకమైన క్యాప్ పెట్టుకోవడం మరింత వైరల్ గా మారింది.

ఈ ఇద్దరు ఒకే తరహాలో క్యాప్ పెట్టుకోవడంతో మళ్లీ వారి రిలేషన్షిప్ పై హింట్ ఇస్తున్నారు అంటూ రకరకాల కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక వీటిపై కూడా ఈ గీత గోవిందం జోడి పెద్దగా రియాక్ట్ కాలేదు. ఇక ఇద్దరు సినీ తారలు కూడా వారి కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో పాటు గౌతమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే మరో రెండు చర్చల దశలో ఉన్నాయి. ఇక రష్మిక పుష్ప 2 సినిమాతో పాటు ధనుష్ కుబేర సినిమా చేస్తోంది. మరొక రెండు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులతో కూడా అమ్మడు మరింత బిజీగా మారనుంది.