Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. సీమ పొగరు..

కంప్లీట్ రాయలసీమ లోకల్ ఫ్లేవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. అలాగే విజయ్ క్యారెక్టర్ అందులో చాలా పొగరుగా పవర్ఫుల్ గా ఉంటుందట.

By:  Tupaki Desk   |   28 Nov 2023 9:45 AM GMT
విజయ్ దేవరకొండ.. సీమ పొగరు..
X

రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నుంచి నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్లన్స్ వర్కౌట్ కావడం లేదని టాక్ అయితే వస్తోంది.

ఇక మరోవైపు విజయ్ గౌతమ్ తిన్ననూరి సినిమాను ఇదివరకే స్టార్ట్ చేశాడు. కానీ ఫ్యామిలీ స్టార్ ను తొందరగా పూర్తి చేయాలి అని ఆ సినిమాకు కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. విజయ్ తో సినిమా చేయడానికి ఇప్పుడు రాహుల్ సంకృత్యాన్ కూడా రెడీ అవుతున్నాడు. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన టాక్సీవాలా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఆ సినిమా అనంతరం గతంలోనే రాహుల్ తో విజయ్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు సెట్ కాలేదు. ఇక ఇప్పుడు ఒక డిఫరెంట్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథ ఫిక్స్ చేసుకున్న దర్శకుడు నెవ్వర్ బిఫోర్ అనేలా రౌడీ స్టార్ ను ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో క్యారెక్టర్ కోసం విజయ్ రాయలసీమ స్లాంగ్ పై పట్టు సాధించేందుకు శిక్షణ కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం.

కంప్లీట్ రాయలసీమ లోకల్ ఫ్లేవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. అలాగే విజయ్ క్యారెక్టర్ అందులో చాలా పొగరుగా పవర్ఫుల్ గా ఉంటుందట. ఇప్పటివరకు తెలంగాణ యాస లో ఎక్కువగా ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు రాయలసీమ యాస మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా కంప్లీట్ స్క్రిప్ట్ దాదాపు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

దర్శకుడు రాహుల్ త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసుకొని సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అబుకుంటున్నారు. ఇక విజయ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుతో పాటు ఒకేసారి రాహుల్ సినిమాను ఫినిష్ చేసే అవకాశం ఉంది. అయితే ఫ్యామిలీ స్టార్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనే దానిపైన ఈ రెండు సినిమాలకు విజయ్ డేట్స్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి డ్రాప్ అయ్యి మార్చి నెలలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.