Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. కత్తి పట్టబోతున్నాడా?

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతుంది. ఈ సినిమాను దర్శకుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 2:30 AM GMT
విజయ్ దేవరకొండ.. కత్తి పట్టబోతున్నాడా?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచేసాడు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రాబోతోంది. అలాగే లిస్టులో గౌతం తిన్ననూరితో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పోలీస్ అలాగే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ఇక వీటితోపాటు విజయ్ దేవరకొండ మరో రెండు ప్రాజెక్టులు విషయంలో చర్చలు జరుపుతున్నాడు.

అందులో ముఖ్యంగా రాహుల్ సంకృత్యన్ ప్రాజెక్టును త్వరలోనే స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు వీరి కలయికలో టాక్సీవాలా అనే సినిమా వచ్చింది. ఇక రాహుల్ ఆ తర్వాత నానితో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చూశాడు. అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఇక ఇప్పుడు విజయ్ తో చేయబోయే సినిమాను రాహుల్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో తెరపైకి తీసుకురాబోతున్నాడు.

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతుంది. ఈ సినిమాను దర్శకుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాస్త యాక్షన్ తో పాటు సీరియస్ డ్రామాని కూడా ఇందులో హైలెట్ చేస్తారట. ఇక 90ల కాలంలో పిరియడ్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

బహుశా మొదటిసారి విజయ్ దేవరకొండతో దర్శకుడు కత్తి పట్టిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయలసీమ బ్యాగ్రౌండ్ లో వచ్చిన కథలలో దాదాపు అందరూ మాస్ హీరోలు కూడా కత్తులు పట్టుకున్న వారే. ఇక విజయ్ దేవరకొండ కూడా అదే రూట్లో వెళతాడా? లేదంటే మరొక వివిధమైన పాయింట్ ఏదైనా హైలెట్ చేస్తాడా అనేది చూడాలి.

ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ ప్రతి కథ కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ఒక సీరియస్ సినిమా చేసినప్పుడు మధ్యలో ఫ్యామిలీకి దగ్గర అయ్యేలా క్లాస్ కథలను కూడా చేస్తున్నాడు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి గౌతమ్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. దాంతోపాటు రాహుల్ ప్రాజెక్టును కూడా కొనసాగించి తొందరగానే ముగించే ఛాన్స్ ఉందట.