Begin typing your search above and press return to search.

నిర్మాత సెటైర్ కి.. విజయ్ తండ్రి ఏమన్నారంటే..!

ఆ సినిమా ఫ్లాపులొ విజయ్ దేవరకొండకి సంబంధం లేకపోయినా కావాలనే అతని పేరు పాడుచెయ్యడానికి విజయ్ ని ఇలా లాగుతున్నాడు అని విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు ఆరోపించారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 5:26 PM GMT
నిర్మాత సెటైర్ కి.. విజయ్ తండ్రి ఏమన్నారంటే..!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవర కొండ రీసెంట్ ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, చాలా కాలం తర్వాత తన మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడం తో విజయ్ దేవర కొండ చాలా ఖుష్ అయ్యాడు. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ రిజల్ట్ పట్ల విజయ్, సమంత ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.

అందుకే, విజయ్ దేవర కొండ ఆనందంలో తాను ఈ సినిమాకు అందుకున్న పారితోషకంలో కోటి రూపాయలను వంద కుటుంబాలకు పంచిపెడతానని ప్రకటించాడు. డబ్బు అవసరం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వమని కూడా చెప్పాడు. అయితే, విజయ్ ఇచ్చిన ఆఫర్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. అయితే, నిర్మాత అభిషేక్ నామా దీనిపై కౌంటర్ వేశాడు.

విజయ్ దేవర కొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ప్లాప్ అయ్యిందని, దాని వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని అందుకు విజయ్ సహాయం కావాలని ట్వీట్ పెట్టాడు. ఆయన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. మూవీ ప్లాప్ అయితే హీరోకి ఏంటి సంబంధం..? లాభం వస్తే హీరోకి వాటా ఇస్తారా అంటూ చాలా మంది ఫ్యాన్స్ విజయ్ కి సపోర్ట్ గా నిలిచే ప్రయత్నం చేశారు.

అయితే, తాజాగా ఈ విషయంపై విజయ్ దేవర కొండ తండ్రి గోవర్ధన్ రావు స్పందించారు. ఆ సినిమా ఫ్లాపులొ విజయ్ దేవరకొండకి సంబంధం లేకపోయినా కావాలనే అతని పేరు పాడుచెయ్యడానికి విజయ్ ని ఇలా లాగుతున్నాడు అని విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు ఆరోపించారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల తరువాత విజయ్ తన పారితోషికంతో చాలా భాగం తీసుకోలేదని, అది నిర్మాత కెఎస్ రామారావు కి కూడా తెలుసన్నాడు. ఈ మూవీ తర్వాత తాము అభిషేక్ నామా ని కూడా కలిశామని కూడా చెప్పాడు. కావాలనే రెండు నాలుకలతో మాట్లాడుతున్నాడు అని మంటపడ్డారు. కావాలనే విజయ్ ని టార్గెట్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇక ఫ్యూచర్ లో అభిషేక్ నామాతో విజయ్ సినిమా చేయడు అని ఆయన చెప్పారు.