Begin typing your search above and press return to search.

బేబీకి మరింత బూస్ట్ ఇవ్వబోతున్న రౌడి

అయితే, ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవర కొండ వస్తున్నారట.

By:  Tupaki Desk   |   17 July 2023 8:21 AM GMT
బేబీకి మరింత బూస్ట్ ఇవ్వబోతున్న రౌడి
X

యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరో చాలా కాలం తర్వాత హిట్ కొట్టారు. ఆయన న‌టించిన తాజా చిత్రం బేబీ. ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీలో వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టించింది. విరాజ్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించారు.

విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న'క‌ల‌ర్ ఫొటో' సినిమాకు క‌థ అందించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది

మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ నటకు ప్రశంసల వర్షం కురుస్తోంది. అసలు పెద్దగా గుర్తింపు లేని నటీనటులతో సినిమా తీసి ఊహించని హిట్ అందుకున్నారు. కాగా మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో, చిత్ర బృందం ఈ మూవీ సక్సెస్ మీట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారట.

అయితే, ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవర కొండ వస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ విషయంలో తన సోదరుడు ఆనంద్ దేవర కొండకు ఈ రౌడీ హీరో చాలా సపోర్టివ్ గా ఉంటూ వస్తున్నారు. నిజానికి, ఆనంద్ మొదటి మూవీకి కూడా ఇంత సోపోర్ట్ ఇచ్చి ఉండడు.అలాంటిది, ఈ మూవీ ప్రీమియర్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నాడు.

ఇప్పుడు సక్సెస్ మీట్ లోనూ పాల్గొంటున్నాడు. తన మూవీ షూటింగ్స్ ఉన్నప్పటికీ, వాటిని పక్కన పెట్టి, ఈ బేబీ టీమ్ కి సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా, ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది.

రెండో రోజు అనుకున్న దాని కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మూడో రోజులో ఎంటర్ అయిన బేబి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. ఓవర్సీస్ లో 275K మార్క్ ని దాటేసిన సినిమా ఇప్పుడు హాల్ఫ్ మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతోంది.