VD 14 బడ్జెట్.. మైత్రి డేర్ స్టెప్..!
సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఉన్నారంటే ఆ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది.
By: Tupaki Desk | 14 May 2025 2:00 AM ISTకింగ్డమ్ తర్వాత విజయ్ దేవరకొండ రెండు భారీ సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తుండగా మరో సినిమా రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో రాబోతుంది. రాహుల్ తో విజయ్ ఆల్రెడీ టాక్సీవాలా సినిమా చేశాడు. సో ఈ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది చరిత్రకు సంబంధించిన కథ అని టాక్. వీడీ 14కి సంబందించి ఒక ప్రీ లుక్ పోస్టర్ విజయ్ బర్త్ డే రోజు రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ తోనే సినిమాపై ఒక బజ్ క్రియేట్ చేశారు. ఐతే ఇంతకీ ఈ సినిమా కథ ఏంటన్నది బయటకు రావట్లేదు. చరిత్రకు సంబంధించిన ఒక కథనే తీసుకుని ఈ సినిమా చేస్తున్నారట.
శ్యామ్ సింగ రాయ్ తో తన సత్తా చాటిన రాహుల్ ఈసారి విజయ్ దేవరకొండతో తీసే సినిమా ఇంకాస్త పెద్దగా ఉండబోతుందని టాక్. ముఖ్యంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 200 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నారట. VD14 సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు విజయ్ సినిమాలు 100 కోట్ల బడ్జెట్ లోపే ఇంకా చెప్పాలంటే 50 నుంచి 60 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు 200 కోట్లు బడ్జెట్ అంటే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ప్రొసీడ్ అవుతున్నారని తెలుస్తుంది.
సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఉన్నారంటే ఆ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. సో విజయ్ దేవరకొండ రాహుల్ ఈసారి ఏదో పెద్ద ప్లానింగ్ తోనే దిగుతున్నారని అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కింగ్ డం రిలీజ్ అవగానే రౌడీ జనార్ధన్ పనుల్లో ఉంటాడని తెలుస్తుంది. ఆ తర్వాత రాహుల్ సినిమాకు లైన్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.
