Begin typing your search above and press return to search.

విజయ్ తో ఆ హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్టేనా..! సాక్షి వైద్

రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు ఉన్నా సాక్షి వైద్య కి విజయ్ సినిమాలో ఛాన్స్ రావడం అదృష్టమని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 1:17 PM GMT
విజయ్ తో ఆ హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్టేనా..! సాక్షి వైద్
X

ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. ఆల్రెడీ పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి రిలీజ్ లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ చివరి దశకు రాగా తర్వాత చేస్తున్న గౌతం తిన్ననూరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసినట్టే అని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ 12వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ముందు శ్రీ లీలని హీరోయిన్ గా అనుకున్నారు. సినిమా ఓపెనింగ్ కి కూడా శ్రీ లీల అటెండ్ అయ్యింది. అయితే ఈమధ్య విజయ్ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుందని ఓ టాక్ వచ్చింది.

అయితే నిర్మాత నాగ వంశీ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. శ్రీ లీలనే హీరోయిన్ అని గట్టిగా చెప్పారు. కానీ శ్రీ లీలకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు.

రష్మిక కూడా ఇప్పుడు బిజీ అవడంతో ఆమె కూడా ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోయినట్టు తెలుస్తుంది. విజయ్ రష్మిక కాంబో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కానీ రష్మిక డేట్స్ కుదరకనే సినిమా వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది. శ్రీ లీల, రష్మిక ఇద్దరు కాదన్నాక ఫైనల్ గా ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య కి ఆ లక్కీ ఛాన్స్ వరించిందని తెలుస్తుంది.

అక్కినేని అఖిల్ ఏజెంట్ తో తెలుగు తెరకు పరిచయమైన సాక్షి వైద్య ఆ సినిమా డిజాస్టర్ అందుకున్నా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గాండివధారి అర్జున సినిమాలో ఛాన్స్ అందుకుంది. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా కూడా సాక్షి వైద్య కి ఫెయిల్యూర్ రిజల్ట్ అందించింది. రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు ఉన్నా సాక్షి వైద్య కి విజయ్ సినిమాలో ఛాన్స్ రావడం అదృష్టమని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ అంతా భారీగా ఉందని టాక్.

ఫ్యామిలీ స్టార్ 2024 పొంగల్ కి వస్తుండగా గౌతం తిన్ననూరి సినిమాను ఇయర్ ఎండింగ్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు విజయ్ దేవరకొండ అండ్ టీం. సాలిడ్ హిట్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న విజయ్ దేవరకొండకి ఈ రెండు ప్రాజెక్ట్ లు మంచి స్కోప్ ఉందని చెప్పొచ్చు.