Begin typing your search above and press return to search.

దాని కోస‌మే ఇప్ప‌టికీ చ‌దువుతూనే ఉన్నా!

టీవీ ఇండ‌స్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన వాసుకి ఆనంద్, తొలి ప్రేమ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సోద‌రిగా న‌టించి సినీ రంగ ప్ర‌వేశం చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Sept 2025 3:00 PM IST
దాని కోస‌మే ఇప్ప‌టికీ చ‌దువుతూనే ఉన్నా!
X

జీవితంలో ఎప్పుడు ఎవ‌రేం చేసినా ఒక ప‌ర్ప‌స్ ఉంటుంది. ఆ ప‌ర్ప‌స్ తోనే ఎవ‌రైనా ఏదైనా చేస్తూ ఉంటారు. పిల్ల‌లు, టీనేజ‌ర్స్ గా ఉన్న‌ప్పుడు చ‌దువుకుంటే, పెద్ద‌వాళ్లయ్యాక జాబ్ చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తుంటారు. కానీ కొంద‌రు మాత్ర‌మే వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంత పెద్దైన‌ప్ప‌టికీ ఏదొక‌టి చ‌దువుతూ ఉంటారు. అలాంటి వారిలో న‌టి వాసుకి ఆనంద్ కూడా ఒక‌రు.

తొలిప్రేమ‌కు ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా నంది అవార్డు

టీవీ ఇండ‌స్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన వాసుకి ఆనంద్, తొలి ప్రేమ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సోద‌రిగా న‌టించి సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆ సినిమాలో త‌న న‌ట‌న‌కు గానూ ఆమెకు ఉత్త‌మ స‌హాయ న‌టిగా నంది అవార్డు కూడా ద‌క్కింది. 23 టీవీ సీరియ‌ల్స్ లో న‌టించిన దేవ‌కి, ఆ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అన్నీ మంచి స‌కున‌ములే సినిమాతో తిరిగి మూవీస్ లోకి వ‌చ్చారు.

ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు, సిరీస్‌ల్లో న‌టించి త‌న న‌ట‌న‌తో ఆడియ‌న్స్ ను మెప్పించిన వాసుకి, గ‌తేడాది వ‌చ్చిన 90స్ వెబ్‌సిరీస్ తో అంద‌రి మ‌న‌సుల్ని గెలుచుకున్నారు. ఆ త‌ర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాలో క‌నిపించిన వాసుకి తాజాగా బ్యూటీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. అంకిత్ కొయ్య‌, నీల‌ఖి జంట‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో న‌రేష్, వాసుకి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

బ్యూటీ సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటూ వాసుకి ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాను ఇప్ప‌టికీ స్టూడెంట్ అనే విష‌యన్ని వెల్ల‌డించారు. ఎంట‌ర్‌ప్రెన్యూర్ అవాల‌ని ఫైనాన్స్& బ్యాంకింగ్ లో ఎంబీఏ చేశాన‌ని చెప్పిన వాసుకి, సైకాల‌జీ పై ఇష్టంతో సెల్ఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం పీహెచ్‌డీ చేస్తున్నాన‌ని చెప్పారు. తాను కేవ‌లం అకాడ‌మీ పుస్త‌కాలే కాకుండా సైక‌లాజీకి సంబంధించి రైట‌ర్స్ రాసిన బుక్స్ ను కూడా చ‌దువుతాన‌ని ఆమె తెలిపారు.