'విశ్వంభర' డైరెక్టర్ హీరోగా ఆ హీరోయిన్‌తో సినిమా చేశారా?
వీళ్ల తరహాలో డైరెక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాడో డైరెక్టర్. అతనెవరో కాదు మెగాస్టార్ చిరంజీవితో `విశ్వంభర` మూవీని తెరకెక్కిస్తున్న మల్లిడి వశిష్ట.
By: Tupaki Desk | 15 April 2025 12:33 PM ISTడాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని కొంత మంది చెప్పడం తెలిసిందే. కానీ రవితేజ, నాని తరహాలో డైరెక్టర్ కావాలని వచ్చి యాక్టర్ అయిన వాళ్లున్నారు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన రవితేజ ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇవ్వడం, స్టార్ హీరోల సరసన నిలవడం తెలిసిందే. ఇదే తరహాలో సీనియర్ డైరెక్టర్ బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిన నాని అలియాస్ నవీన్ బాబు ఆ తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన `అష్టాచెమ్మ` సినిమాతో హీరోగా మారడం, ఆ తరువాత నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకుని వంద కోట్ల క్లబ్‌లో చేరడం తెలిసిందే.
వీళ్ల తరహాలో డైరెక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాడో డైరెక్టర్. అతనెవరో కాదు మెగాస్టార్ చిరంజీవితో `విశ్వంభర` మూవీని తెరకెక్కిస్తున్న మల్లిడి వశిష్ట. దర్శకుడు కావాలని పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి దర్శకుడిగా అవకాశాల కోసం తిరిగి విసిగి వేసారిపోయిన మల్లిడి వశిష్ట ఇక డైరెక్షన్ కుదరదని ఆ విషయాన్ని పక్కన పెట్టి ఓ సినిమాలో హీరోగా నటించారు ఆ విషయం చాలా మందికి తెలియదు.
దర్శకుడు మల్లిడి వశిష్ట హీరోగా నటించిన మూవీ 'ప్రేమలేఖ రాశా'. తేజ సినిమాలతో లిరిక్ రైటర్‌గా సంచలనం సృష్టించిన కులశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మల్లిడి వశిష్టకు జోడీగా ఈ మూవీలో అంజలి నటించింది. సినిమా బాగా రాకపోవడం, అనుకున్న విధంగా కులశేఖర్ ఈ సినిమాని తీయలేకపోవడంతో దీన్ని రిలీజ్ చేసి మరింతగా నష్టాలని చవిచూడటం ఎందుకని రిలీజ్ చేయకూడదని మల్లిడి సత్యనారాయణ పక్కన పెట్టారట.
అయితే జెమినీ టెలివిజన్‌కు ఈ సినిమా శాటిలైట్ హక్కులు మాత్రం ఇవ్వడంతో అప్పుడప్పుడు ఈ సినిమా జెమినిలో ప్రసారం అవుతోందని తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మల్లిడి వశిష్ట మైథలాజికల్ మూవీ `విశ్వంభర`ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.