Begin typing your search above and press return to search.

మెగా 156 గుట్టు విప్పిన వశిష్ఠ!

బింబిసారా మూవీ తో డెబ్యూ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ట తన నెక్స్ట్ మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Dec 2023 12:38 PM GMT
మెగా 156 గుట్టు విప్పిన వశిష్ఠ!
X

బింబిసారా మూవీ తో డెబ్యూ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ట తన నెక్స్ట్ మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న విషయం తెలిసిందే. #Mega156 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవల లాంఛనంగా షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీతో చిరంజీవిని సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు వశిష్ట.

ఇదిలా ఉంటే గతంలో ఈ ప్రాజెక్టు జగదేకవీరుడు అతిలోకసుందరికి సీక్వెల్ గా ఉండబోతుందని వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మెగాస్టార్ తో చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు దర్శకుడు వశిష్ట. తాజాగా ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయిన వశిష్ట.. మెగాస్టార్ తో చేయబోయే ప్రాజెక్టు ఏ సినిమాకి సంబంధం లేదని, ఇది కంప్లీట్ గా ఫ్రెష్ స్క్రిప్ట్ అని చెప్పారు. 100% సినిమా ఆయన స్టైల్ లోనే ఉంటుంది.

అదే సమయంలో నేను అనుకున్న జోనర్లో ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు. చిరంజీవి గారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. అలాంటి అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. అలాంటి అవకాశం నాకు వచ్చింది. నాకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఎలాంటి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఐడియాను ఆయనతో షేర్ చేసుకుంటే అది ఆయనకి బాగా నచ్చింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయింది" అంటూ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వశిష్ట.

అంతేకాకుండా వీలైనంత తక్కువ టైంలోనే సినిమాని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. కానీ అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ ని మొదలెట్టారు. కాగా సినిమాలో చిరంజీవి సరసన ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ని మేకర్స్ ఇప్పటికే పరిశీలించారు.

వారిలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మెగాస్టార్ సరసన ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో త్రిష నటిస్తున్నట్లు సమాచారం. చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని త్రిష ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో త్రిషకి ఆ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.కాగా ఈ సినిమాకి 'విశ్వంభర' అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.