Begin typing your search above and press return to search.

అల్లుడు ఖాతాలో అప్పుడే మూడు!

న‌ష్టాలు త‌ప్ప ఆ సినిమాకి లాభాలెక్క‌డా? క‌నిపించ‌లేదు. అటుపై `రంగ‌రంగ వైభ‌వంగా` అనే మ‌రో సినిమా చేసాడు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 1:30 PM GMT
అల్లుడు ఖాతాలో అప్పుడే మూడు!
X

`ఉప్పెన‌`తో ఉప్పెన‌లా దూసుకొచ్చిన వైష్ణ‌వ్ తేజ్ అటు పై ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డినట్లే క‌నిపిస్తుంది. తొలి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అందించినా..మ‌లి చిత్రాల‌న్నీ ప్లాప్ బాట‌లోనే ప‌య‌నిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. రెండ‌వ చిత్రంగా క్రిష్ ద‌ర్వ‌క‌త్వంలో `కొండపొలం` చేసాడు. ఇదొక డిఫ‌రెంట్ అటెంప్ట్. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం. దీంతో ఈ సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాలు తీసుకురాలేదు.

న‌ష్టాలు త‌ప్ప ఆ సినిమాకి లాభాలెక్క‌డా? క‌నిపించ‌లేదు. అటుపై `రంగ‌రంగ వైభ‌వంగా` అనే మ‌రో సినిమా చేసాడు. ఇది భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన అభిమానుల్ని నిరాశ‌ప‌రిచింది. ఈ సినిమా డివైడ్ టాక్ ఎలాగైనా గ‌ట్టెక్కొచ్చు అనుకున్నా! అంతిమంగా అది సాధ్యం కాలేదు. తాజాగా ఇటీవలే `ఆదికేశ‌వ‌`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మ‌రి ఈ సినిమా ప‌రిస్థితి ఏంటి? అంటే ముందు రెండు సినిమాల త‌రహా ఫ‌లితాలే సాధించిన‌ట్లు తెలుస్తోంది.


దీంతో వైష్ణ‌వ్ ఖాతాలో హ్యాట్రిక్ ప్లాప్ లు న‌మోదైట్లు తెలుస్తోంది. వ‌రుస‌గా మూడు సినిమాలు ప‌రాజ‌యం చెంద‌డం అభిమానుల్ని నిరాశ ప‌రుస్తుంది. మ‌రి ఈ ప్లాప్ ల్ని మెగా అల్లుడు ఎలా తీసుకుంటున్నాడు? అన్న‌ది చూడాలి. ఇంత వర‌కూ వీటి గురించి మాట్లాడే ప్ర‌య‌త్నం ఎక్క‌డా చేయ‌లేదు. కొత్త ప్రాజెక్ట్ లు ఎంపిక చేసుకునే బిజీలో ఉన్నాడు త‌ప్ప‌! ప్లాప్ ల్ని ఎంత‌వ‌ర‌కూ విశ్లేషించుకున్నాడు? అన్న‌ది ఎక్క‌డా డిస్క‌స్ చేయ‌లేదు.

ఇదే విష‌యంలో తేజ్ అయితే జ‌రిగిన త‌ప్పిదాల గురించి విశ్లేషించుకుంటాడు. త‌దుప‌రి ఆ త‌ప్పిదాలు మ‌ళ్లీ దొర్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాన‌ని చెబుతుంటాడు. కొన్ని ప్లాప్ సినిమాల త‌ర్వాత ఇలా విశ్లేషించుకో వ‌డం తేజ్ మొద‌లు పెట్టాడు. మ‌రి వైష్ణ‌వ్ ఆ విష‌యాన్ని లైట్ తీసుకుంటున్నాడా? లేక సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు మాట్లాడుదాం అని సైలెంట్ గా ఉన్నాడా? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ కొత్త సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.