అక్కినేని కాంపౌండ్ కథలో హీరో మారుతున్నాడా?
యంగ్ డైరెక్టర్ `బింబిసార` ఫేం మల్లిడి వశిష్ట అక్కినేని కాంపౌండ్ లో కి ఎంటర్ అయినట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 May 2025 5:30 PMయంగ్ డైరెక్టర్ `బింబిసార` ఫేం మల్లిడి వశిష్ట అక్కినేని కాంపౌండ్ లో కి ఎంటర్ అయినట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కింగ్ నాగార్జునకు స్టోరీ చెప్పినట్లు ఆయన పాజి టివ్ గా స్పందించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇదొక డిఫరెంట్ జానర్ స్టోరీ అని పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతుందని లీకైంది. అయితే ఇప్పుడీ స్టోరీ చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున ఈ కథని తనతో కాకుండా నాగచైతన్య లేదా అఖిల్ తో చేస్తే బాగుంటుందని సూచించారుట. దీని గురించి వశిష్ట ఆలోచించి చెబుతానన్నాడుట. పాన్ ఇండియా అంటే `తండేల్` తో నాగచైతన్య పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీలో తొలిసారి సెంచరీ నమోదు చేసింది చైతన్య. అఖిల్ ఇంకా సక్సెస్ కోసం పోరాటం చేస్తున్నాడు.
అతడితో? అప్పుడే పాన్ ఇండియా సినిమా అంటే రిస్క్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకుని వశిష్ట నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్లకు ప్రీడమ్ ఇవ్వడం లో కింగ్ ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. అతడితో దర్శకులు ఎంతో కంపర్ట్ గా పని చేస్తుంటారు. అలాంటి అవకాశమే వశిష్టకు కల్పి స్తున్నారు. ఈ కథలో తనకంటే తర్వాత తరం హీరోలైతే బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఇలా సూచిం చినట్లు తెలుస్తోంది.
మరి నిర్ణయం తీసుకోవాల్సింది వశిష్ట. ముందుకు వెళ్లాలా? లేదా? అన్నది అతడి చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా వశిష్ట `విశ్వంభర` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షణ్ పనుల్లో ఉంది. ఈ సినిమా రిలీజ్ అనంతరమే తదుపరి సినిమాపై వశిష్ట నిర్ణయం తీసుకుంటాడు.