Begin typing your search above and press return to search.

ఐశ్వర్యకు 'కన్నప్ప' ఓవర్సీస్ రైట్స్.. ఇప్పుడు కల నిజమైందట..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 May 2025 4:00 PM
ఐశ్వర్యకు కన్నప్ప ఓవర్సీస్ రైట్స్.. ఇప్పుడు కల నిజమైందట..
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మైథలాజికల్ మూవీగా రానున్న కన్నప్పను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కీలక పాత్రలో నటిస్తున్నారు కూడా.

ఆయనతోపాటు అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ సహా అనేక మంది స్టార్ నటీనటులు కనిపించనున్నారు. అయితే జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న కన్నప్ప ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను వసారా ఎంటర్టైన్మెంట్ యూఎస్‌ ఏ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని గర్వంగా ప్రకటించింది.

వసారా ఎంటర్టైన్మెంట్ యూఎస్‌ ఏను ఐశ్వర్య గుంటిరెడ్డి స్థాపించి.. సినిమా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె.. రాశి మూవీస్ నర్సింహారావుగా ప్రసిద్ధ చెందిన ప్రముఖ నిర్మాత నర్సింహారావు కుమార్తె. సినిమా పట్ల ఎంతో మక్కువ ఉన్న ఆమె.. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ పట్ల దృక్పథంతో ఉన్నారు.

తాను చాలా కాలంగా అమెరికాలో భారతీయ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు తెలిపారు ఐశ్వర్య. సినిమా నిజంగా తన రక్తంలోనే ఉందని చెప్పారు. కొంతకాలంగా తాను ఒక ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించాలని కలలు కన్నానని, ఇప్పుడు VASARAAతో నిజమైందని చెప్పారు. కన్నప్పతో ప్రయాణాన్ని ప్రారంభించడం మరింత గౌరవమని తెలిపారు.

ఒక సినిమా ఔత్సాహికురాలిగా మాత్రమే కాకుండా, శివుని నిజమైన భక్తురాలిగా తన హృదయానికి దగ్గరగా ఉన్న కథ కన్నప్ప అని చెప్పారు. ఆ సినిమా కేవలం ఒక వాణిజ్య ప్రయత్నం కంటే ఎక్కువగా వర్ణించారు. ప్రస్తుత తరంలోని ప్రతి బిడ్డ మన చరిత్ర, మన దేవుళ్ళను తెలుసుకోవాలని, కన్పప్పతో అది జరుగుతుందని అన్నారు.

అయితే వసారా సంస్థ.. నార్త్ అమెరికాతోపాటు కెనడాలో కన్నప్పను గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ కూడా చేయనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అందుకోసం మంచు విష్ణు ఇప్పటికే యూఎస్ కు స్టార్ట్ అయ్యారు. మరి ఓవర్సీస్ లో కన్నప్ప ఎలాంటి హిట్ అవుతుందో.. ఐశ్వర్య ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.