Begin typing your search above and press return to search.

లవర్స్ డే రోజు లావణ్యతో కాకుండా.. వరుణ్ గ్రేట్ డిసిషన్

అసలే వీరి పెళ్లి అనంతరం వస్తున్న మొదటి వాలెంటైన్స్ డే. కాబట్టి ఆ రోజు కొత్త జంటగా ఎంతో స్పెషల్ గా గడపాల్సిన అవసరం ఉంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 8:07 AM GMT
లవర్స్ డే రోజు లావణ్యతో కాకుండా.. వరుణ్ గ్రేట్ డిసిషన్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీ.. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌ అని మేకర్స్ బలంగా చెబుతున్నారు. ఒకే సమయంలో తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. బై లింగ్యువల్ సినిమాగా రెండు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, వందేమాతరం సాంగ్, గగనాల సాంగ్ ఛార్ట్ బస్టర్స్ అవడంతో మంచి బజ్ క్రియేట్ అయింది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌ గా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్‌ గా కనిపించనుంది. మరో టాలెంటెడ్ బ్యూటీ రుహాని శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. గత కొన్నిరోజలుగా మేకర్స్ ఫుల్ స్పీడ్ లో ఈ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నార్త్ లో వరుణ్ ఓ రేంజ్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాారు. త్వరలోనే తెలుగులో కూడా ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.

ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రేమికుల దినోత్సవం రోజు తన సతీమణితో ఉండడం లేదు. అసలే వీరి పెళ్లి అనంతరం వస్తున్న మొదటి వాలెంటైన్స్ డే. కాబట్టి ఆ రోజు కొత్త జంటగా ఎంతో స్పెషల్ గా గడపాల్సిన అవసరం ఉంది. కానీ వరుణ్ తేజ్ అలా చేయడం లేదు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ టీమ్ తో కలిసి పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించేందుకు వరుణ్ సిద్ధమయ్యారు. వీరసైనికుల ప్రాణ త్యాగానికి హృదయపూర్వక నివాళులు అర్పించనున్నారు.

2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడి జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బంది వెళ్తున్న కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరగ్గా.. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఇప్పుడు వారికి నివాళులు అర్పించడానికి వరుణ్ సహా టీమ్ అంతా రేపు వెళ్లనుంది. ప్రేమికుల రోజు వరుణ్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

అయితే ఈ మూవీలోని వందేమాతరం సాంగ్ ను కూడా మేకర్స్.. సైనికులతో పాటు ఆఫీసర్ల సమక్షంలో విడుదల చేశారు. ఇప్పుడు పుల్వామా దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లి నివాళులు అర్పించడం గ్రేట్ అని నెటిజన్లు చెబుతున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం దేశంలో వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా చూపించబోతోందని మేకర్స్ చెబుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందీ సినిమా. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.