Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ ని భయపెట్టిన పవన్, చరణ్

మేము చిన్న వయస్సులో ఉన్నప్పుడు చిరంజీవి, కళ్యాణ్ బాబాయ్ కూల్ డ్రింక్ యాడ్స్ చేసేవారు. మీరు సరదాగా ఆ డ్రింక్స్ యాడ్స్ తో ఫన్నీగా ట్రోల్ చేసుకునేవాళ్ళం.

By:  Tupaki Desk   |   28 Feb 2024 9:24 AM IST
వరుణ్ తేజ్ ని భయపెట్టిన పవన్, చరణ్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ మూవీ మార్చి 1న థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.

ఇంట్లో తమతో కళ్యాణ్ బాబాయ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. చిరంజీవి కూడా పిల్లలతో తమతో సరదాగా స్పెండ్ చేస్తూ ఉండేవారని ఓ సంఘటన గుర్తుచేసుకున్నాడు. మేము చిన్న వయస్సులో ఉన్నప్పుడు చిరంజీవి, కళ్యాణ్ బాబాయ్ కూల్ డ్రింక్ యాడ్స్ చేసేవారు. మీరు సరదాగా ఆ డ్రింక్స్ యాడ్స్ తో ఫన్నీగా ట్రోల్ చేసుకునేవాళ్ళం.

నేను చిరంజీవి గారి వైపు ఉంటే చరణ్, కళ్యాణ్ బాబాయ్ వైపు ఉండేవాడు. పెదనాన్న ఉన్నంత వరకు నాకు ప్రొటక్షన్ ఉండేది. ఆయన షూటింగ్ కి వెళ్ళిపోయిన తర్వాత బాబాయ్, చరణ్ కలిసి నన్ను గదిలో పెట్టి లైట్స్ ఆర్పేసి భయపెట్టారు. టీనేజ్ లో చరణ్ అన్న, కళ్యాణ్ బాబాయ్ ఎప్పుడూ ఒక టీంగా ఉండి నన్ను టీజ్ చేస్తూ ఏడిపించేవారని వరుణ్ తేజ్ ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంట్లో పిల్లలతో పవన్ కళ్యాణ్ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు అనేది వరుణ్ తేజ్ మాటల బట్టి తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయాన్ని కూడా వరుణ్ తన మాటల్లో బయట పెట్టాడు. రీసెంట్ గా క్రిస్మస్ ఫెస్టివల్ కి అందరం మళ్ళీ కలుసుకొని సరదాగా ఆడుకున్నాం అంటూ వరుణ్ తేజ్ తెలిపాడు.

మెగా ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుస్తోందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇంటరెస్టింగ్ కామెంట్స్ ఆ వీడియో క్రింద పెడుతున్నారు. ఇప్పుడు అందరూ స్టార్స్ అయిన కూడా మెగా ఫ్యామిలీలో ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుందనేది వరుణ్ తేజ్ మాటలతో స్పష్టం అయ్యింది.