Begin typing your search above and press return to search.

జ‌న‌సేనాని వెంటే మెగా హీరోలంతా: వరుణ్ తేజ్

కేవ‌లం మీరు మాత్ర‌మే కాదు.. మా కుటుంబం కుటుంబంలో అంద‌రూ బాబాయ్ వెంటే ఉంటాం.

By:  Tupaki Desk   |   25 July 2023 5:40 PM GMT
జ‌న‌సేనాని వెంటే మెగా హీరోలంతా: వరుణ్ తేజ్
X

సాయి ధరమ్ తేజ్ తన మేన‌మామ పవన్ కళ్యాణ్ తో కలిసి ఫాంటసీ కామెడీ డ్రామా 'బ్రో'లో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ సితంకి అధికారిక రీమేక్. సాయిధరమ్ తేజ్ ప్రమోషన్స్ విషయంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

ఇప్ప‌టివ‌ర‌కూ అన్ని మీడియా ఇంటర్వ్యూలు ఆడియెన్ తో ఇంటరాక్టివ్ సెష‌న్స్ లో 'బ్రో' రాజ్ కుమార్ హిరాణీ చిత్రంలా ఉంటుందని నొక్కి చెప్పాడు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులు నవ్వులతో కేకలు వేస్తారు. సినిమా ముగింపు మాత్రం రాజ్ కుమార్ హిరాణీ సార్ చిత్రంలా ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తుంది'' అని సాయి ధరమ్ తేజ్ ఇటీవలి ఇంటరాక్షన్ లో పేర్కొన్నారు.

మున్నాభాయ్ MBBS - 3 ఇడియట్స్ తరహాలో 'బ్రో' సాలిడ్ ఎంటర్ టైనర్ అవుతుందని సాయి ధరమ్ తేజ్ న‌మ్మ‌కాన్ని వ్యక్తం చేశారు. ఈ హైప్ కి త‌గ్గ‌ట్టే సినిమా లో మ్యాట‌ర్ ఉందా లేదా? అన్న‌ది ఈ శుక్ర‌వారం (28 జూలై) తేలిపోనుంది. అయితే అంత‌కుముందే ప్రీరిలీజ్ ఈవెంట్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎదుట మెగా యువ‌హీరోలు సాయిధ‌ర‌మ్ తేజ్- వ‌రుణ్ తేజ్- వైష్ణ‌వ్ తేజ్ ఒకే వేదిక‌ పై ముచ్చటించే అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్నారు.

ప్రీరిలీజ్ వేడుక‌ లో వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ-''బాబాయ్ సినిమాలు చేసినా లేదా రాజ‌కీయాలు చేసినా అభిమానులు ఎప్పుడూ త‌న వెంటే ఉంటార‌నేది మా అంద‌రి న‌మ్మ‌కం. కేవ‌లం మీరు మాత్ర‌మే కాదు.. మా కుటుంబం కుటుంబంలో అంద‌రూ బాబాయ్ వెంటే ఉంటాం. నేను.. సాయి ధ‌ర‌మ్.. వైష్ణ‌వ్.. చ‌ర‌ణ్ అన్న అంద‌రూ బాబాయ్ వెంటే ఉన్నాం'' అంటూ ఎంతో ఎమోష‌నల్ గా మాట్లాడారు. టీజీ వెంక‌టేష్ - బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ స‌హా ఈ సినిమా క‌థానాయిక‌లు కేతిక శ‌ర్మ‌- ప్రియా వారియ‌ర్ - ఊర్వ‌శి రౌతేలా త‌దిత‌రులు బ్రో ఈవెంట్లో పాల్గొన్నారు.