Begin typing your search above and press return to search.

మెగా అప్డేట్... కొన్నాళ్లు సినిమాల నుంచి ఔట్‌

గాండీవదారి అర్జున సినిమా సక్సెస్ అయి ఉంటే వెంటనే వరుణ్‌ కొత్త సినిమా పనుల్లో పడేవాడేమో

By:  Tupaki Desk   |   30 Aug 2023 5:53 AM GMT
మెగా అప్డేట్... కొన్నాళ్లు సినిమాల నుంచి ఔట్‌
X

మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉన్నాడు. గని సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని చేసిన వరుణ్‌ తేజ్ కి నిరాశే మిగిలింది. సరే అనుకుని తాజాగా గాండీవదారి అర్జున సినిమా తో వరుణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సందడి చేయడం లో విఫలం అయింది.

గాండీవదారి అర్జున సినిమా సక్సెస్ అయి ఉంటే వెంటనే వరుణ్‌ కొత్త సినిమా పనుల్లో పడేవాడేమో. కానీ ఆ సినిమా నిరాశ పరచడం తో చిన్న బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తన పెళ్లి పనులతో కూడా బిజీ అవ్వాలని భావిస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్‌, లావణ్య ల వివాహం ఇటాలిన్‌ రిసార్ట్ లో భారీ ఎత్తున జరుగబోతుంది.

ఇప్పటికే తన తల్లి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉందని వరుణ్ తేజ్ చెప్పాడు. ఇప్పుడు వరుణ్ కూడా సినిమా షూటింగ్‌ లను పక్కన పెట్టి పెళ్లి పనులు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి సినిమాల గురించి ఆలోచించకుండా పర్సనల్‌ లైఫ్ ను ఎంజాయ్‌ చేయాలని వరుణ్‌ భావిస్తున్నాడు.

వరుసగా సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ నిజంగానే కొన్నాళ్ల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుని ఫ్రెష్ మైండ్‌ తో సినిమా లు చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వరుణ్ తేజ్ పెళ్లి హడావుడి అంటూ తెగ సందడి చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.