Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ సినిమా.. ఇక ఇప్పట్లో లేనట్లే?

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సమర్పణలో రినస్సైన్స్ పిక్చర్స్ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 4:46 AM GMT
వరుణ్ తేజ్ సినిమా.. ఇక ఇప్పట్లో లేనట్లే?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఆపరేషన్ వాలంటైన్. హిందీ, తెలుగు భాషలలో సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై భారీ బడ్జెట్ తో ఆవిష్కరించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సమర్పణలో రినస్సైన్స్ పిక్చర్స్ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 8న ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. టీజర్, సాంగ్స్ లాంటివి రిలీజ్ చేయలేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత కొద్ది రోజులు రిలాక్స్ అయ్యి కరుణ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఆపరేషన్ వాలంటైన్ సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కనీసం దర్శక, నిర్మాతల నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి సౌండ్ లేదు. దీంతో అసలేం జరుగుతుందో అర్ధం కాని అయోమయంలో ఈ మూవీ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గని, గాండీవదారి అర్జున సినిమాలతో రెండు డిజాస్టర్ సినిమాలని వరుణ్ తేజ్ ఖాతాలో వేసుకున్నాడు. ఆపరేషన్ వాలంటైన్ తో హిట్ కొడతాడని అందరూ భావిస్తున్నారు. అయితే సినిమా నుంచి మాత్రం అప్డేట్ లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ బట్టి ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంట. వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడొచ్చని భావిస్తున్నారు. సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయాలని దర్శక, నిర్మాతలు డిసైడ్ అయ్యారంట. అందుకే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వైజాగ్ నేపథ్యంలో చేయబోతున్న మట్కా మూవీ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. పీరియాడికల్ జోనర్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధం కాబోతోంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.