Begin typing your search above and press return to search.

వరుణ్‌ - లావణ్య లవ్‌ సీక్రెట్స్ రివీల్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం జరిగింది

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:26 AM GMT
వరుణ్‌ - లావణ్య లవ్‌ సీక్రెట్స్ రివీల్‌
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. వీరి ప్రేమ విషయం నిశ్చితార్థం వరకు సీక్రెట్ గా ఉంటూ వచ్చింది. వరుణ్ తేజ్‌ ప్రేమ విషయంలో అంతగా సీక్రెట్‌ మెయింటెన్‌ చేశాడా అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

తాజాగా ఒక చిట్ చాట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. లావణ్య త్రిపాఠితో ప్రేమ విషయాన్ని ఇన్నాళ్లు రివీల్ చేయకుండా ఉండటానికి కారణం ఫ్యామిలీ ఇష్యూ అసలు కాదు. మా రిలేషన్ గురించి బయటకు చెబితే అది మా ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ ను తీసుకు వచ్చే అవకాశం ఉందని ఇద్దరం ముందే మాట్లాడుకుని సీక్రెట్ గా ఉంచుతూ వచ్చాము.

మెగా ఫ్యామిలీ లో వరుణ్ తేజ్ ప్రేమ వ్యవహారం ను ఒప్పుకోవడం లేదని... అందుకే లావణ్య త్రిపాఠి తో ప్రేమ విషయాన్ని వరుణ్‌ తేజ్ సీక్రెట్‌ గా ఉంచుతూ వచ్చాడు. నాగబాబు తాను చూసిన అమ్మాయిని మాత్రమే చేసుకోవాలని వరుణ్‌ తేజ్ కి కండీషన్ పెట్టాడు అంటూ కూడా ఆ మధ్య పుకార్లు వచ్చాయి.

ఆ పుకార్లపై కూడా వరుణ్‌ స్పందిస్తూ.. మా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా నా ప్రేమ విషయమై ఇబ్బంది లేదు. నా నిర్ణయాలకు ఇంట్లో ఎప్పుడు కూడా మద్దతు లభిస్తుంది. అంతే కాకుండా లావణ్య ఇంట్లో కూడా ఆమెపై నమ్మకం ఉంది. ఆమె చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుని తన కాళ్ళపై తాను నిలుచుంది.

ఆమె నిర్ణయాన్ని గౌరవించడం తో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ నా పై పూర్తి నమ్మకాన్ని ఉంచారు. మా ప్రేమకు రెండు వైపుల నుంచి కూడా మద్దతు ఉంది. కనుక ఎలాంటి ఇబ్బంది లేదని వరుణ్ తేజ్ అన్నాడు. లావణ్య తో వరుణ్ ఇప్పటికే రెండు సినిమాల్లో నటించాడు. పెళ్లి తర్వాత మంచి కథలు వస్తే తప్పకుండా మరిన్ని సినిమాల్లో లావణ్య తో కలిసి నటిస్తానంటూ వరుణ్ పేర్కొన్నాడు.