Begin typing your search above and press return to search.

వరుణ్ లవ్.. మంచులో అడ్వెంచర్ థ్రిల్!

మెగా హీరో వరుణ్ తేజ్ బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Feb 2024 11:28 AM GMT
వరుణ్ లవ్.. మంచులో అడ్వెంచర్ థ్రిల్!
X

మెగా హీరో వరుణ్ తేజ్ బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ జోడి పెళ్లి తర్వాత వెంటనే మళ్ళీ వారి సినిమాలతో బిజీ అయ్యారు. సాధారణంగా కొత్తగా పెళ్లయిన వారు వీలైనంత ఎక్కువగా వారి భాగస్వామితో సమయాన్ని కేటాయిస్తారు. కానీ ముందుగా ఒప్పుకున్న సినిమాల వలన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా పెళ్లయిన వెంటనే బిజీ కావాల్సి వచ్చింది.


ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ లో కూడా బిజీ అవుతున్నారు. ఇటీవల వాలెంటైన్స్ డే రోజు కూడా అతను లావణ్యతో కొంత సమయాన్ని కూడా కేటాయించలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆ ప్రమోషన్స్ కు బ్రేక్ ఇచ్చిన ఈ జంట మళ్ళీ వారి ప్రేమ ప్రపంచంలో మునిగితేలుతున్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరు కూడా మంచి పర్వతంలో అడ్వెంచర్ ను ఎంజాయ్ చేసినట్లుగా ఫోటోల ద్వారా తెలియజేశారు.

స్నో స్కేటింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంటూ ఈ ప్రేమ అనుభూతులను ఎప్పటికీ మర్చిపోలేను విధంగా చేసినట్లు వివరణ ఇచ్చారు. లావణ్య వరుణ్ తేజ్ చాలా చూడముచ్చటైన జంట అంటూ వారి ఫాలోవర్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎప్పటికి ఇలాగే సంతోషంగా ఉండాలి అని కూడా వారు బ్లెస్సింగ్ అందిస్తూ ఉన్నారు.

ఇక వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని కసిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీగానే రిలీజ్ కానుంది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా అని వర్గాల వారికి నచ్చుతుంది అని వరుణ్ తేజ్ కూడా ప్రమోషన్స్ లో చాలా కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉన్నాడు.

ఇక మరొకవైపు లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్ లతోపాటు కొన్ని చిన్న సినిమాలు కూడా చేస్తోంది. ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా ఎప్పటిలాగే తన సినిమా కెరియర్ ను కొనసాగిస్తూ ఉంది. ఇక ఏ మాత్రం గ్యాప్ దొరికిన తన భర్త వరుణ్ తేజ్ తో ఇలా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటోంది.