Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత ఆ టార్చర్ ఎక్కువైందంటున్న స్టార్ హీరో..!

నవంబర్ లో పెళ్లైతే 3 నెలలు బయట పెద్దగా కనిపించని వీరిద్దరు ఫైనల్ గా వారి సినిమా ప్రమోషన్స్ కి బయటకు వస్తున్నారు

By:  Tupaki Desk   |   19 Feb 2024 1:51 PM GMT
పెళ్లి తర్వాత ఆ టార్చర్ ఎక్కువైందంటున్న స్టార్ హీరో..!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లాడిన విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లుగా వీరిద్దరి ప్రేమలో ఉన్నా కూడా ఎవరికీ డౌట్ రాకుండా భలే మేనేజ్ చేశారు. ఎంగేజ్మెంట్ రోజు అరకు తమ రిలేషన్ షిప్ ని చాలా సీక్రెట్ గా ఉంచారు వరుణ్ తేజ్ అండ్ లావణ్య. ఇక ఈమధ్యనే మెగా ఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్ గా వీరి పెళ్లి జరగింది. నవంబర్ లో పెళ్లైతే 3 నెలలు బయట పెద్దగా కనిపించని వీరిద్దరు ఫైనల్ గా వారి సినిమా ప్రమోషన్స్ కి బయటకు వస్తున్నారు.

లావణ్య త్రిపాఠి అదే ఇప్పుడు కొణిదెల లావణ్య రీసెంట్ గా మిస్ పర్ఫెక్ట్ సీరీస్ చేసింది. ఈ సీరీస్ తో మరోసారి ప్రేక్షకులను అలరించింది లావణ్య. పెళ్లి తర్వాత ఆమె అంతా మామూలుగానే ఉందని చెప్పుకొచ్చింది. సినిమా సెలక్షన్స్ లో మెగా ఫ్యామిలీ ఆంక్షలపై కూడా ఆమె స్పందించింది. వరుణ్ కానీ మిగతా ఎవరు కానీ తన సినిమా సెలక్షన్ గురించి అడగలేదని చెప్పింది లావణ్య.

ఇక వరుణ్ తేజ్ మాత్రం పెళ్లి తర్వాత చాలా మారిపోయాయి అంటున్నాడు. ప్రస్తుతం అతను నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మల్లా రెడ్డి కాలేజ్ లో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా యాంకర్ సుమ పెళ్లి తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయా అని అడిగితే.. పెళ్లి తర్వాత కాల్స్ ఎక్కువయ్యాయని.. ఎక్కడికి వెళ్తున్నావ్.. ఎప్పుడొస్తావ్ లాంటి కాల్స్ వస్తున్నాయని వరుణ్ తేజ్ చెప్పాడు.

అందరు వైఫ్స్ లానే లావణ్య కూడా ఫోన్ కాల్స్ తో తనను టార్చర్ పెడుతుందని వరుణ్ తేజ్ చెప్పకనే చెప్పాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం వరున్ తేజ్ వరుస ఫ్లాపులతో కెరీర్ లో వెనకపడ్డాడు. ఆఫ్టర్ మ్యారేజ్ హీరోలు కొందరికి సూపర్ గా కలిసి వస్తుంది. మరి లావణ్య రాక వరుణ్ తేజ్ కెరీర్ ని ఏ రేంజ్ కు తీసుకెళ్తుందో చూడాలి. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్.