Begin typing your search above and press return to search.

మట్కా పుకార్లు.. ఫైనల్ గా తేల్చేసిన డైరెక్టర్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు

By:  Tupaki Desk   |   8 March 2024 6:21 AM GMT
మట్కా పుకార్లు.. ఫైనల్ గా తేల్చేసిన డైరెక్టర్!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో క్లిక్ కాలేదు.. దీంతో ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇద్దామనుకున్న వరుణ్ కు నిరాశే మిగిలింది. నెక్స్ట్ మూవీ మట్కాపైనే వరుణ్ ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు.

అయితే మట్కా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ రాకపోవడంతో మూవీ ఆగిపోయిందని గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అవుతోందని, వరుణ్ కు వరుస ప్లాఫ్ లు రావటంతో సినిమాను ఆపేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్ల సమయంలో వాటిపై వరుణ్ క్లారిటీ ఇచ్చినా.. వార్తలు ఆగడం లేదు.

తాజాగా ఈ వార్తలను మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ ఖండించారు. షూటింగ్ ఆలస్యానికి గల కారణాలను కరుణ కుమార్.. ఓ మీడియాతో తెలిపారు. “నిజానికి మేం ఇప్పటికే మట్కా రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేశాం. 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఇటీవల మరో షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకున్నాం. కానీ ఇంతలో ఆపరేషన్ వాలైంటెన్ టీమ్.. ప్యాచ్ వర్క్ కోసం వరుణ్ ను మళ్ళీ రమ్మంది. దీంతో వరుణ్.. తన రోల్ కోసం హెయిర్ కట్ చేసుకుని వెళ్లారు" అని తెలిపారు.

"ఇప్పుడు మట్కా షూటింగ్ స్టార్ట్ అవ్వాలంటే.. వరుణ్ హెయిర్ పెరగాలి. అందుకే షూటింగ్ కాస్త ఆలస్యమైంది. ఈ ప్రాజెక్ట్ కు ఎలాంటి బడ్జెట్ సమస్యలు లేవు. బడ్జెట్ పై వస్తున్న వార్తలన్నీ పుకార్లే. ఇప్పటికే బడ్జెట్ ఫిక్సయ్యాం. మొత్తం పూర్తయ్యేసరికి 10-20 శాతం ఎక్కువ అవ్వొచ్చు. ఇప్పటికే జరిగిన షూటింగ్ పార్ట్ క్వాలిటీని చూసి నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు" అంటూ కరుణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ బడ్జెట్ తో మట్కా మూవీని నిర్మిస్తున్నారు. 1958 లో జరిగే కథ కావడంతో 60, 80ల మధ్య వాతావరణాన్ని రీక్రియేట్ చేసేందుకు భారీ సెట్లను రూపొందించారు. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి స్పెషల్ అప్డేట్ రానుందని సమాచారం.