Begin typing your search above and press return to search.

గాంఢీవధారి అర్జున.. ఆయుధం సిద్ధం

ఈ మూవీ విడుదల దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 7:19 AM GMT
గాంఢీవధారి అర్జున.. ఆయుధం సిద్ధం
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చివరగా ఎఫ్3 తో హిట్ కొట్టిన ఆయన వరసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ నుంచి ఓ చిన్న టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా, ఈ మూవీ విడుదల దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారట. సినిమా విడుదలకు తక్కువ టైమ్ ఉండడంతో సినిమాకు హైప్ పెరగాలి అంటే ట్రైలర్ ఆయుధం బలంగా ఉండాలి. ఇక మేకర్స్ ఓ అధికారిక ప్రకటన చేశారు. దీంతో, ట్రైలర్ ఎలా ఉంటుందా అని ఇప్పటికే క్యూరియాసిటీ మొదలవ్వడం విశేషం.

ఈ మూవీలో వరుణ్ సరసన సాక్షి వైద్య నటిస్తున్నారు. ఆమెకు తెలుగులో ఇది రెండో సినిమా. మొదటి సినిమా అఖిల్ ఏజెంట్ లో మెరిసింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో, ఈ బ్యూటీ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో వరుణ్ ఏజెంట్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ క్యారెక్టర్ అందరినీ షాకింగ్ కి గురి చేస్తుందట. ఆమె కూడా ఓ స్పెషల్ అధికారిగా కనిపించనుందని సమాచారం. ఒకప్పటి హీరోయిన్ విమలా రామన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తుందట.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇటీవల ఈ మూవీ నుంచి ఓ చిన్న వీడియో విడుదల చేశారు. దీంట్లో. హీరో ఇంట్రడక్షన్ ఇచ్చారు. వరుణ్ ఈ మూవీలో అర్జున్ వర్మగా కనిపించనున్నాడు. ఓ స్పై అధికారిగా కనిపించనున్నాడని ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. మొత్తం కథ ESSAY(elite security service Agecy)చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. కాగా, యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో ప్రవీణ్ సత్తారు కంటూ ఒక మార్క్ ఉంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడేమో చూడాలి. ప్రవీణ్ సత్తారు కూడా ఈ హిట్ చాలా అవసరం.