Begin typing your search above and press return to search.

వ‌రుణ్ తేజ్ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

వ‌రుణ్ తేజ్- మానుషి చిల్లర్ జంట‌గా న‌టించిన `ఆపరేషన్ వాలెంటైన్` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:37 AM GMT
వ‌రుణ్ తేజ్ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?
X

వ‌రుణ్ తేజ్- మానుషి చిల్లర్ జంట‌గా న‌టించిన `ఆపరేషన్ వాలెంటైన్` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం మార్చి 1న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ సైనికుడిగా నటిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలపైనా వ‌రుణ్‌ ముచ్చ‌టించాడు.

హైదరాబాద్‌ MRCET కాలేజీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన వ‌రుణ్ కి ఒక విద్యార్థి నుంచి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. వరుణ్ తేజ్‌ని తన అభిమాన హీరోయిన్ ఎవరు? అని ఒక‌ విద్యార్థి అడిగాడు. వరుణ్ సమాధానం చెప్పడానికి వెనుకాడలేదు. తన భాగస్వామి లావణ్య త్రిపాఠి త‌న ఫేవ‌రెట్ హీరోయిన్ అని చెప్పాడు. తన జీవితంలో తనకు ఇష్టమైన హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నానని, ప్రస్తుతం ఆ నటి తన ఇంట్లోనే ఉంటోందని చెప్పాడు. లావణ్యతో పాటు తనకు సాయి పల్లవి కూడా ఇష్టమని, 2017లో బాక్సాఫీస్ హిట్ చిత్రం `ఫిదా`లో స్క్రీన్‌ను షేర్ చేసుకున్న సాయి పల్లవి కూడా తనకు ఇష్టమని వరుణ్ పేర్కొన్నాడు.

త‌మ మ‌ధ్య‌ రిలేషన్‌షిప్‌లో మొదట ఎవరు ప్రపోజ్ చేశారంటూ ఒక విద్యార్థి అడిగారు. ముసిముసి నవ్వులతో వరుణ్ బదులిస్తూ.. ఎప్పుడూ అబ్బాయిలే ముందుగా ప్రపోజ్ చేస్తారని అందరికీ తెలుసు అని అన్నాడు. దీంతో వ‌రుణ్ తొలిగా లావ‌ణ్య‌కు ప్ర‌పోజ్ చేసాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి 1 నవంబర్ 2023 న ఇటలీలో డెస్టినేష‌న్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ జంట అనుబంధానికి సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే వ‌రుణ్ న‌టించిన `ఆప‌రేష‌న్ వాలెంటైన్` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. లావణ్య త్రిపాఠి నటించిన `మిస్ పర్ఫెక్ట్` ఫిబ్రవరి 2న OTTలో విడుదలైంది. 2022 చిత్రం `హ్యాపీ బర్త్‌డే` తర్వాత లావ‌ణ్య‌కు కంబ్యాక్ మూవీ ఇది.