Begin typing your search above and press return to search.

ఆపరేషన్ వాలెంటైన్ తో అక్కడ ఎంట్రీ..!

ఈ సినిమా ప్రమోషన్స్ లో బాలీవుడ్ ఎంట్రీపై తన ఆలోచన చెప్పాడు వరుణ్ తేజ్.

By:  Tupaki Desk   |   23 Aug 2023 6:20 PM GMT
ఆపరేషన్ వాలెంటైన్ తో అక్కడ ఎంట్రీ..!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకే రకమైన సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా వెరైటీ కథలు, వెరైటీ పాత్రలు చేస్తూ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. ముకుందతో తొలి సినిమానే ఒక ప్రయోగంగా చేసిన వరుణ్ తేజ్ కంచె, అంతరిక్షం సినిమాలతో తన పంథా కొనసాగించాడు. అయితే ఎప్పుడు ప్రయోగాలన్నా కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వవు. అందుకే అన్ని సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్.

ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో కూడా ఆడియన్స్ కి ఒక మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించాలని ఫిక్స్ అయ్యాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాలీవుడ్ ఎంట్రీపై తన ఆలోచన చెప్పాడు వరుణ్ తేజ్. ప్రత్యేకంగా హిందీ సినిమాలంటూ చేయలేం కానీ కథ అక్కడ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది అంటే పాన్ ఇండియా సినిమాలు చేస్తానని అన్నారు.

వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ దాదాపు అలాంటి అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తెలుగు వెర్షన్ తీసి హిందీలో డబ్ చేయకుండా తెలుగు, హిందీ బైలింగ్వెల్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ ప్రొడక్షన్, అక్కడ డైరెక్టర్ కలిసి చేస్తున్న ఈ సినిమాతో అఫీషియల్ గా వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ జరుగుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది.

కెరీర్ మొదటి నుంచి సినిమాల విషయంలో తన ప్రత్యేకత చాటుతూ వస్తున్న వరుణ్ తేజ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ ని పట్టించుకోకుండా తన పంథాను కొనసాగిస్తున్నాడు. మరి మెగా ప్రిన్స్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి. గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఈ రెండు సినిమాలతో వరుణ్ తేజ్ కమర్షియల్ గా కూడా తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.

ఇక మెగా హీరో పెళ్లి విషయానికి వస్తే సీక్రెట్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ స్టోరీ నడిపించిన వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ముందు వరకు అది తెలియకుండా జాగ్రత్త పడటంలో సక్సెస్ అయ్యాడు. ఎంగేజ్మెంట్ తర్వాత ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ముహూర్తం ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.