క్రిస్ మస్ టార్గెట్ తో మెగా ప్రిన్స్..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓ పక్క మిగతా హీరోలంతా కూడా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే వరుణ్ తేజ్ మాత్రం చాలా వెనకపడ్డాడు.
By: Tupaki Desk | 19 May 2025 1:00 AM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓ పక్క మిగతా హీరోలంతా కూడా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే వరుణ్ తేజ్ మాత్రం చాలా వెనకపడ్డాడు. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ సినిమా ఏది కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. చివరగా వచ్చిన మట్కా సినిమా అయితే డిజాస్టర్ అనిపించుకుంది. ప్రతి హీరోకి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. ఐతే కమర్షియల్ చట్రంలో ఇరుక్కోకూడదు అనే ఆలోచనతో కొత్త కథలతో తన ప్రయత్నాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. కానీ అతని ప్రయత్నాలన్నీ రివర్స్ అవుతున్నాయి.
అందుకే ఈసారి ఒక ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే ఎంటర్టైనింగ్ సినిమా అయినా అందులో కూడా ఏదో ఒక కొత్త అటెంప్ట్ అనిపించేలా ఉండాలని కొరియన్ హర్రర్ కామెడీ డ్రామా సినిమాతో వస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రోజు నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇండో కొరియన్ హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది.
ఈ సినీఅ విషయంలో వరుణ్ తేజ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. మేర్లపాక గాంధీ కూడా ఈసారి పక్కా హిట్ టార్గెట్ తో ఈ సినిమా చేస్తున్నాడని టాక్. ఐతే ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని క్రిస్ మస్ బరిలో దించేలా చూస్తున్నారట. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు కొరియన్ కనకరాజు అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారట.
సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు కమెడియన్ సత్య కూడా ఫుల్ లెంగ్త్ రోల్ తో అలరిస్తాడని తెలుస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఎలాగైనా హిట్ ఇచ్చేలా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. మరి వరున్ తేజ్ కి ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు. థ్రిల్లర్ సినిమాలకు థమన్ బిజిఎం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. సో పక్కా ప్లానింగ్ తోనే వరున్ తేజ్ 15వ సినిమా సెట్ చేస్తున్నట్టుగా అర్ధమవుతుంది.
