Begin typing your search above and press return to search.

ప్రెట్టీ హాట్ గర్ల్ అంటూ సమంత‌కు కితాబు

బ్లాక్ షర్ట్‌లో యంగ్ లుక్‌లో కనిపిస్తున్న ఫోటోను ధావ‌న్ షేర్ చేశాడు. వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా స‌మంత ఈ ఫోటోపై స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. ''ఎవ‌రు ఈ టీనేజ‌ర్?

By:  Tupaki Desk   |   17 April 2024 3:01 PM GMT
ప్రెట్టీ హాట్ గర్ల్ అంటూ సమంత‌కు కితాబు
X

స‌మంత తొలిసారి హిందీ ప‌రిశ్ర‌మ‌లో త‌న కెరీర్ విస్త‌ర‌ణ కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇంత‌లోనే అలాంటి ఒక ఆఫ‌ర్ సిటాడెల్ రూపంలో త‌న వెంట‌ప‌డింది. అమెరిక‌న్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా న‌టించ‌గా, భార‌తీయ వెర్ష‌న్ సిటాడెల్ లో స‌మంత ప్ర‌ధాన‌పాత్ర‌ధారిగా న‌టించింది. 'సిటాడెల్: హనీ బన్నీ'లో స‌మంత‌- వ‌రుణ్ ధావ‌న్ జంట‌గా న‌టించారు. సామ్ తో అత‌డికి మంచి స్నేహం ఏర్ప‌డింది. అంతేకాదు.. స‌మంత‌కు మ‌యోసైటిస్ స‌మ‌యంలో అండ‌గా నిలిచాడు స‌హ‌చ‌రుడు వ‌రుణ్. అత‌డు సామ్ తో ఎంతో స‌ర‌దాగా ఫ‌న్ ని క్రియేట్ చేస్తుంటాడు. అంత‌గా ఆ ఇద్ద‌రి న‌డుమా ర్యాపో కుదిరింది.

ఇటీవల తన ఇన్‌స్టాలో అత‌డు ఒక పోస్ట్ షేర్ చేసాడు. బ్లాక్ షర్ట్‌లో యంగ్ లుక్‌లో కనిపిస్తున్న ఫోటోను ధావ‌న్ షేర్ చేశాడు. వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా స‌మంత ఈ ఫోటోపై స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. ''ఎవ‌రు ఈ టీనేజ‌ర్? అని ప్ర‌శ్నించిన సామ్ తక్షణమే అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ స్మార్ట్ గా ఉండే వరుణ్ ధావన్ వెంట‌నే దీనికి సమాధానమిచ్చాడు. ''ఈ వేసవిలో అత‌డు ఈ అందమైన అమ్మాయితో సిరీస్‌లో పని చేస్తున్నాడని నాకు తెలియదు'' అని స‌ర‌సంగా జ‌వాబిచ్చాడు.

సామ్ అభిమానుల్లో క‌ల‌కలం సృష్టించింది ఈ సంభాష‌ణ‌. సిటాడెల్: హనీ బన్నీ ప్రచార ప్రయత్నాలలో ఈ ఉల్లాసభరితమైన పరిహాసం హైలైట్‌గా మారింది. రాజ్ అండ్ DK దర్శకత్వం వహించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ సిరీస్ ఈ సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ సిరీస్ గా రిలీజ్ కానుంది.