Begin typing your search above and press return to search.

వరుణ్ సందేశ్ 'చిత్రం చూడర'!

రాకా రాక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం వరుణ్ సందేశ్ ఏదో​ చేసేందుకు సిద్ధమవ్వడం​.. ఈ క్రమంలోనే తన పార్ట్నర్స్​తో ఓ ఇంట్లోకి చొరబడటం

By:  Tupaki Desk   |   27 Oct 2023 7:55 AM GMT
వరుణ్ సందేశ్ చిత్రం చూడర!
X

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్.. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్​లు అందుకుని ఆ తర్వాత సరైన సక్సెస్​ కోసం ఏళ్ల తరబడి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'చిత్రం చూడర' అనే సస్పెన్స్​ థ్రిల్లర్​ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజైంది.


వరుణ్ సందేశ్​, ధనరాజ్​, కాశీ విశ్వనాథ్ రాత్రి పూట ఓ వాల్ హౌస్​పై కూర్చొని ఉండటంతో టీజర్ ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్​ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్​గా వరుణ్ కనిపించారు. వరుణ్​ చేయబోయే క్రైమ్​లో ధనరాజ్​, కాశీ విశ్వనాథ్ క్రైమ్​ పార్ట్నర్స్​గా కనిపించారు. ఈ టీజర్​లో కోర్​ పాయింట్​ ఏమీ రివీల్ చేయలేదు. మొత్తంగా సస్పెన్స్​, యాక్షన్ ఎలిమెంట్స్​తోనే కట్​ చేశారు. సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.

రాకా రాక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం వరుణ్ సందేశ్ ఏదో​ చేసేందుకు సిద్ధమవ్వడం​.. ఈ క్రమంలోనే తన పార్ట్నర్స్​తో ఓ ఇంట్లోకి చొరబడటం, ఆ తర్వాత 'లెక్కున్నోడు లేట్ నైట్ అయినా పవర్ స్టార్ అనే అంటాడు.. తిక్కున్నోడు ఎప్పుడూ తీన్ మార్ కిక్​లోనే ఉంటాడు' అంటూ ఆయన డైలాగ్స్​ చెప్పడం చూపించారు. మధ్య మధ్యలో రవిబాబు తనికెళ్ల భరణికి సంబంధించిన సన్నివేశాలను చూపించారు. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ ఆకట్టుకుంటోంది.

హై ప్రొడక్షన్ వ్యాల్యూస్​, టెక్నికల్ స్టాండర్డ్స్​తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ధన తిరుమల సినిమాకు కో ప్రొడ్యూసర్​. టాలెంటెండ్ టెక్నిషియన్​ రాధన్​ మ్యూజిక్ అందిస్తున్నారు. జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్​గా, మార్తండ్ కే వెంకటేశ్ ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు. ఇంకా చిత్రంలో రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, రచ్చ రవి, కేఏ పాల్ రాము, పింగ్ పాంగ్ సూర్య, రైజింగ్ రాజు తదితరులు తెరపై కనిపించనున్నారు. నేనింతే మూవీ ఫేమ్ అతిథి గౌతమ్ ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ చేస్తోంది.

ఆర్​ఎన్​ హర్షవర్ధన్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయనే స్క్రీన్ ప్లే, డైలాగ్స్​ అందిస్తున్నారు. బీఎమ్​ సినిమాస్ బ్యానర్​పై శేషు మారమ్ రెడ్డి - బోయపాటి భాగ్యలక్ష్మీ సినిమాను నిర్మిస్తున్నారు. షీతల్ భట్​ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.