Begin typing your search above and press return to search.

పాన్ ఇండియాను కొట్టాలంటే సౌత్ డైరెక్ట‌ర్ల‌తోనే సాధ్యం!

యువ‌హీరో వరుణ్ ధావన్ బ్యాక్ టు బ్యాక్ సౌత్ డైరెక్ట‌ర్ల‌పై ఆధార‌ప‌డ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   9 Aug 2023 4:48 AM GMT
పాన్ ఇండియాను కొట్టాలంటే సౌత్ డైరెక్ట‌ర్ల‌తోనే సాధ్యం!
X

యువ‌హీరో వరుణ్ ధావన్ బ్యాక్ టు బ్యాక్ సౌత్ డైరెక్ట‌ర్ల‌పై ఆధార‌ప‌డ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు బాలీవుడ్ అగ్ర హీరోలు షారూఖ్ ఖాన్- స‌ల్మాన్ ఖాన్ -ర‌ణ‌బీర్ క‌పూర్- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా లాంటి న‌టులు ద‌క్షిణాది డైరెక్ట‌ర్ల‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందుకుంటున్నారు. బిగ బి అమితాబ్ బ‌చ్చన్ ఏకంగా సౌత్ లో క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

ఇంత‌లోనే బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌ణాళిక‌లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. అత‌డు ఇప్పుడు వ‌రుస‌గా సౌత్ డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నాడు. జ‌వాన్ ఫేం అట్లీతో ఓ భారీ సినిమా చేయబోతున్నట్లు కొంతకాలం క్రితం వార్తలు వస్తున్నాయి. వరుణ్ దానిపై ఎక్కువ వివరాలను వెల్లడించనప్పటికీ ఇప్ప‌టికే అత‌డు క‌థ‌ను లాక్ చేసాడు. త్వరలో VD 18ని ప్రారంభించబోతున్నట్లు చెప్పాడు. నేటి నుండి ఈ చిత్రం నుండి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. సినిమా విడుదల తేదీని 31 మే 2024 అని కూడా ప్రకటించాడు.

వ‌రుణ్ ధావ‌న్- అట్లీ కాంబినేష‌ణ్ చిత్రాన్ని మురాద్ ఖేతానితో కలిసి ధావ‌న్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్- వామికా గబ్బి (వరుణ్‌తో పాటు చివరిసారిగా జూబ్లీలో కనిపించారు) నాయిక‌లుగా న‌టించ‌నున్నారు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని దీనినుంచి ప్రోమోని క‌ట్ చేస్తార‌ని తెలిసింది. యాక్షన్ డ్రామాతో కూడిన ప్రోమోతో వ‌రుణ్ చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నారని స‌మాచారం.

ఇక జ‌వాన్ లో షారూఖ్ ని స‌రికొత్త అవ‌తారంలో ఆవిష్క‌రిస్తున్న వరుణ్ ని పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంది. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ క‌థ‌నంలో వ‌రుణ్ లుక్ ర‌గ్గ్ డ్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ప్రస్తుతానికి సెప్టెంబర్ 7న విడుదల కానున్న 'జవాన్' తుది మెరుగులతో అట్లీ బిజీగా ఉన్నారు. ప‌ఠాన్ కంటే బెట‌ర్ సినిమాని అట్లీ తెర‌కెక్కించార‌ని అందరూ ఆశిస్తున్నారు. OTTలో విడుదలైన నితేష్ తివారీ 'బవాల్ లో వరుణ్ చివరిగా కనిపించాడు. ఇందులో ధావ‌న్ తో పాటు జాన్వీ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.